గూగుల్లో ట్రెండింగ్‌గా మారిన లావ‌ణ్య త్రిపాఠి క్యాస్ట్‌… చివ‌ర‌కు ప‌ట్టేశారుగా…!

టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు తెలుగింటి కోడలు కాబోతుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ అందాల రాక్షసి మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్‌ను పెళ్ళాడ నుంది. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాదులో వేడుకగా జరిగింది. సోషల్ మీడియాలో మెగా అభిమానులు, తెలుగు సినిమా అభిమానులు వరుణ్ – లావణ్య కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇక లావణ్య కుటుంబ నేపథ్యం గురించి చాలామంది గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. సహజంగానే సెలబ్రిటీల గురించి తెలుసుకునేందుకు చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఆ లిస్టులో లావణ్య కూడా వచ్చి చేరింది. సహజంగానే మన తెలుగు వాళ్లకు ఎవ‌రైనా రికార్డులు సాధించిన‌ప్పుడు లేదా ఏదైనా వింత న‌మోదు చేసిన‌ప్పుడు వారి క్యాస్ట్ గురించి వెతకడం అలవాటు.

ఇప్పుడు లావణ్య క్యాస్ట్ ఏంటని ? గూగుల్లో వెతుకుతున్నారు. అలా ఇప్పుడు లావణ్య పేరు గూగుల్లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. లావణ్య 1990లో ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో జన్మించారు. ఆమె వయసు ప్రస్తుతం 32 సంవత్సరాలు. అందాల రాక్షసి సినిమాతో ఆమె టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమెది బ్రాహ్మణ సామాజికవర్గం.

Varun Tej & Lavanya Tripathi get engaged: See inside pics | Times of India

డెహ్ర‌డూన్‌ లో పెరిగిన లావణ్య తండ్రి హైకోర్టులో న్యాయవాది. తల్లి విశ్రాంత ఉపాధ్యాయురాలు. అయితే గ‌తంలో ఓ సంద‌ర్భంలో లావ‌ణ్య కులం గురించి గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చింది. కులానికి తాను అంత ప్రాధాన్య‌త ఇవ్వ‌ను అని.. మ‌నం చేసే ప‌నుల వ‌ల్లే మ‌నం గొప్ప‌వాళ్లం అవుతామ‌ని… అంతేకాని కులం వ‌ల్ల ఎవ్వ‌రూ గొప్ప‌వారు కాలేర‌ని చెప్పింది. ఇప్పుడు ఆ కామెంట్లు కూడా వైర‌ల్ అవుతున్నాయి.