‘ దేశముదురు ‘ లాంటి బ్లాక్ బాస్టర్ వదులుకుని కెరీర్ నాశ‌నం చేసుకున్న టాలీవుడ్ దుర‌దృష్ట‌వంతుడు ఎవ‌రంటే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో దేశముదురు కూడా ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా యాపిల్ బ్యూటీ హన్సిక హీరోయిన్‌గా నటించింది. ప్రదీప్ రావత్, ఆలీ, జీవ, సుబ్బరాజు తెలంగాణ శకుంతల వంటి వారు కీలకపాత్రలో నటించారు. డీవీవీ దానియ నిర్మించిన ఈ సినిమా 2007లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది.

Desamuduru - Wikipedia

అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. దేశముదురు సినిమాకి చక్రి పాటలు చాలా ప్ల‌స్‌. ఈ పాట‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తొలిసారిగా ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో అల్లు అర్జున్ అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్లో సిక్స్ ప్యాక్ పెంచిన తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు. ఈ సినిమాను పూరి తన మార్క్ డైలాగ్స్ తో మెస్మ‌రైజ్ చేశాడు.

ఈ సినిమా గురించి ఎవరికి ? తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. దేశముదురు సినిమాకు మొదటి ఛాయిస్ అల్లు అర్జున్ కాదట.. నాగార్జున మేనల్లుడు సుమంత్. సుమంత్ తో దేశముదురు సినిమాను తీయాలని పూరి భావించాడట. అదే సమయంలో సుమంత్ హీరోగా నిల‌దొక్కునేందుకు టాలీవుడ్‌లో ప్రయత్నిస్తున్నాడు. పూరీ జగన్నాథ్ సుమంత్ కు దేశముదురు స్టోరీ లైన్ చెప్పాడట.

Sumanth - IMDb

హీరో సన్యాసిని ప్రేమిస్తాడు అంటూ జస్ట్ లైన్‌ మాత్రమే వివరించాడట. అయితే సుమంత్ కు ఆ స్టోరీ లైన్‌ ఏమాత్రం నచ్చలేదట. ఇక దీంతో వెంటనే ఆ సినిమాకు నో చెప్పాడట. ఆ తర్వాత పూరి ఇదే స్టోరీతో అల్లు అర్జున్ వద్దకు వెళ్ళగా ఆయన వెంటనే ఒకే చెప్పాడు. ఇలా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇలా ఇంత మంచి సినిమాను వదులుకొని తన కెరీయర్ని కోల్పోయాడు సుమంత్.