త్రివిక్ర‌మ్ బాల‌య్య వేరే… ప‌వ‌న్ వేరే.. జ‌ర జాగ్ర‌త్త బాసు…!

న‌టసింహం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే ఆయన నటిస్తున్న 108వ సినిమా భగవంత్ కేసరి నుంచి మాస్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ టీజర్ లో బాలయ్య లుక్ అదిరిపోయింది. ఆయన డైలాగులు కూడా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి. అదే సమయంలో బాల‌య్య‌ 109వ సినిమా కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా స్టార్ దర్శకుడు బాబీ డైరెక్షన్లో తెరకెక్కబోతుంది. nbk109 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా అప్డేట్లతో సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు రచ్చ చేస్తున్నారు.

NBK 109: కత్తులు, కొడవళ్ళ మధ్య మాన్షన్ హౌస్.. బాలయ్య అంటే అది

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ బ్యానర్ కూడా స్టార్‌ దర్శకుడు త్రివిక్రమ్‌కు హోం బ్యానర్ లాంటిదే. ఈ సినిమాను ఈ బ్యాన‌ర్‌తో పాటు ఫ్యార్చ్యూన్ సినిమాస్ బ్యాన‌ర్ కూడా క‌లిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అనే బ్యానర్‌ స్థాపించి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు త్రివిక్రమ్.

ఇక ఆయన భార్య సాయి సౌజన్య పేరుపై ఈ ఈ బ్యానర్లో సినిమాలు వస్తున్నాయి. కానీ వెనకుండి త్రివిక్రమే అంత నడిపిస్తార‌న్న‌ది చెప్ప‌క్క‌ర్లేదు. ఆ బ్యానర్లో వచ్చే ఏ సినిమాకు అయినా స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ జోక్యం ఉంటుంది. అవసరమైతే తనకి నచ్చినట్టుగా ఆ స్క్రిప్ట్ మార్చుకుంటూ ఉంటారు.

Bhagavanth kesari teaser Latest Stories at Filmify Telugu, Bhagavanth  kesari teaser Updates, And Many More From Bhagavanth kesari teaser -  Filmify Telugu

త్రివిక్ర‌మ్ స‌హ‌జంగానే ప‌వ‌న్ సినిమాల‌ను కెలికేస్తూ ఉంటాడు. ప‌వ‌న్ సినిమాల‌కు అన్నీ తానై న‌డిపిస్తున్నాడు. వ‌కీల్‌సాబ్‌, భీమ్లానాయ‌క్‌, ఇప్పుడు బ్రో, ఓజీ ఇలా త్రివిక్ర‌మ్ హ్యాండ్ ఉంట‌నే ప‌వ‌న్ సినిమాల‌కు ముందుకు క‌దులుతున్నాయి. అయితే ఇప్పుడు బాల‌య్య సినిమాను త్రివిక్ర‌మ్ కెలికేందుకు ట్రై చేస్తే బాల‌య్య రెస్పాన్స్ ప‌వ‌న్‌లా ఉండ‌దు… అందుకే నెటిజ‌న్లు బాబి సినిమాను కాళ్లు, వేళ్లు పెట్టే ముందు జ‌ర‌జాగ్ర‌త్త ఆలోచించు అని కామెంట్లు చేస్తున్నారు.