మెగా డాటర్ నిహారిక గురించి అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈమె తన భర్త చైతన్యతో విడాకులు తీసుకోబోతుంది అన్న విషయంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరూ ఎవరికి వారే దూరంగా ఉంటున్నారు. వీరి గురించి ఎన్నో వార్తలు వస్తున్నా వారు వాటిపై ఎప్పుడు స్పందించడం లేదు. విడాకుల వార్తల గురించి పట్టించుకోకుండా చైతన్య – నిహారిక ఎవరి పని వారు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు.
అయితే వీరిద్దరు సోషల్ మీడియాలో ఒక్కరికి ఒకరు అన్ ఫాలో చేసుకోవటం అంతేకాకుండా వారి పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేయడంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారనే దానిపై మరింత బలం చేకూరింది. నిహారిక గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అసలు కనిపించడం లేదు. మధ్యలో సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల అదిరే ట్విస్ట్ ఇచ్చింది.
నిహారిక పుల్లటి మామిడికాయలు తింటూ ఒక రకమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి సమ్మర్ అంటే మ్యాంగోస్ లేకుండా ఎలా ? అని క్యాప్షన్ యాడ్ చేసింది. ఆ ఫోటో చూసిన కొంతమంది నిన్న మొన్నటి వరకు విడాకులు తీసుకుంటున్నారు అన్నావారే.. ఇప్పుడు ఏదైనా విశేషమా ? నిహారిక ఏమైనా ప్రెగ్నెంటా ?అంటూ ఇలా మామిడికాయలు తింటుందా ? అని కామెంట్లు పెడుతున్నారు.
ఇప్పటివరకు నిహారిక గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్త వచ్చినా సెకన్లలో స్పందించే నాగబాబు ఇప్పటి వరకు ఈ విషయాలపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. రీసెంట్‌గా జరిగిన నిహారిక అన్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ లో కూడా చైతన్య ఎక్కడ కనిపించలేదు. దీంతో మరోసారి వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు… అందుకే చైతన్య ఈ కార్యక్రమానికి రాలేదన్న వార్తలు మరింతగా స్ప్రెడ్ అవుతున్నాయి.