అనుష్క‌కు ఏకంగా ఆ న‌లుగురితో పెళ్లిళ్లు జ‌రిగాయా… బాల‌య్య‌పైనా షాకింగ్ కామెంట్స్‌…!

తెలుగులో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి అందరికీ తెలిసిందే. ఆమె గురించి ఎంత చెప్పుకున్న తక్కువ అవుతుంది. టాలీవుడ్ లో అందరూ స్టార్ హీరోల‌తో నటించిన అనుష్క తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్ర‌స్తుతం అనుష్క సినిమాలకు కాస్త లాంగ్ బ్రేక్ ఇచ్చింది. బాహుబలి వంటి క్రేజీ ప్రాజెక్టు తర్వాత ఈమె నిశబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల‌ ఆదరణ పొందలేకపోయింది.

Okka Magadu (2008) - IMDb

ఈ సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాల లాంగ్‌ గ్యాప్ త‌ర్వాత‌ అనుష్క ప్రస్తుతం యంగ్ హీరో
నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న శెట్టి .. పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. ఈ క్ర‌మంలోనే అనుష్క తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.

మీరు నటించిన సినిమాలలో మీకు ఇష్టమైన సినిమాలు ఏంట‌ని ? ప్రశ్నించడంతో తనకు అరుంధతి , వేదం సినిమాలు చాలా ఇష్టమని చెప్పింది. ఈమె టాలీవుడ్‌లో ఉన్న‌ అగ్ర హీరోలు అందరి సరసన నటించినా ఆమెకు ఈ రెండు సినిమాలంటేనే బాగా ఇష్ట‌మ‌ట‌. నచ్చిన సినిమా ఏద‌న్న ప్ర‌శ్న‌కు బాలయ్యతో కలిసి నటించిన ఒక్క మగాడు సినిమా తనకు ఏమాత్రం నచ్చదు అంటూ చెప్పింది.

Arundhati (2009) - IMDb

అనుష్క కెరియర్ లో వచ్చిన అతి పెద్ద గాసిప్ ఏంట‌ని అడగగా.. ఐదుసార్లు పెళ్లవ్వడం అని నవ్వుతూ తెలిపింది అనుష్క. ఆ ఐదుగురు ఎవరంటే గోపీచంద్, ప్రభాస్, సుమంత్‌, నాగార్జున అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది.