నిఖిల్ ఇప్పుడు మామూలు హీరో కాదు… ఓ గొప్ప పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇదంతా పైకి గొప్పగా చెప్పుకునేందుకు మాత్రమే. అయితే నిఖిల్ వ్యవహరించే తీరు మాత్రం ఒక్కోసారి మరీ చిన్నపిల్లాడిలా ఉంటుందన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. కార్తీకేయ 2 తర్వాత నిఖిల్‌కు ఎంతోకొంత పాన్ ఇండియా రేంజ్ వచ్చింది.
అయితే దానిని నిలుపుకుంటూ మరింత ముందుకు వెళ్లాల్సిన నిఖిల్ తన బిహేవియర్త తాను నటించే సినిమాల నిర్మాతలకు పెద్ద తలనొప్పులు తెచ్చిపెడుతుంటాడన్న చర్చలు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా నిఖిల్ నటించిన స్పై సినిమా ఓ మోస్తరు పాన్ ఇండియా అంచనాలతో త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక్కడే సరిగ్గా హీరో – నిర్మాత మధ్య సినిమా రిలీజ్‌పై పెద్ద సమస్య తలెత్తింది.
జూన్ 29న రిలీజ్ చేయాలన్నది నిర్మాత కండీషన్. ప్రమోషన్లకు టైం సరిపోదు పోస్ట్ పోన్ చేయాలన్నది నిఖిల్ వాదన. ఒకవేళ రిలీజ్ డేట్ వాయిదా పడితే అమెజాన్ ప్రైమ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాతకు భారీగా నష్టం తప్పదు. అందుకే నిర్మాత తన వెర్షన్లో సినిమా వాయిదా ఒప్పుకోవడం లేదు. ఇది నచ్చని నిఖిల్ అసలు ఈ సినిమా ప్రమోషన్లు, ఇతర వ్యవహారాలకు కూడా దూరంగా ఉన్నాడని టాక్ ?
కనీసం ఓ ట్వీట్ కూడా వేయలేదని అంటున్నారు. అయితే నిఖిల్ సినిమా చివరి నిమిషంలో నిర్మాతలకు బాగా తలనొప్పులు తెచ్చిపెడతాడన్న టాక్ గతం నుంచి ఉంది. నిర్మాతల వెర్షన్.. బిజినెస్ గురించి ఆలోచించకుండా, సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తాడని.. అందుకే అతడితో సినిమా అంటేనే చాలా మంది నిర్మాతలు వెనకా ముందు ఆలోచన చేస్తుంటారని టాక్ ? ఈ ప్రవర్తన వల్లే మిడిల్ రేంజ్, టైర్ 2 హీరోల్లో స్ట్రాంగ్‌గా ఉండాల్సినోడు ఇంకా కిందామీద పడుతూ కెరీర్ లాగిస్తోన్న పరిస్థితి ఉందని ఇండస్ట్రీ ఇన్నర్ సైడ్ టాక్ ?