ఆ హాలీవుడ్ సినిమా ఫాలో అవుతున్న కొరటాల.. ‘ దేవర ‘ తో బాక్సులు బద్దలే…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్‌ తర్వాత తన 30వ సినిమా స్టార్‌ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నాడు. ఇక రీసెంట్ గానే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్నఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న ప్రేక్షకుల‌ ముందుకు తీసుకురానున్నారు. ఇదే సమయంలో ఈ సినిమా నుంచి ఎన్నో ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

NTR30: Jr NTR, Janhvi Kapoor's new film focuses on forgotten coastal lands?  Director Koratala Siva reveals | PINKVILLA

ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే కొరటాల ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెంచేశాడు. ఇదే సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు ఈ సినిమాని హాలీవుడ్ మూవీ ‘ సిసు ‘ నుంచి ఈ సినిమా నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తెరకెక్కిస్తున్నారని చర్చ జరుగుతోంది. సిసు లోని యాక్షన్ సన్నివేశాలు ఎవర్ గ్రీన్ అన్నట్లుగా ఉంటాయి. ఆ సన్నివేశాలను పోలిన యాక్షన్ సన్నివేశాలను దేవరలో కొర‌టాల‌ ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని చర్చ కూడా జరుగుతోంది.

NTR 30 is officially titled Devara; NTR looks marvelous in the first look  poster | 123telugu.com

ఇటీవ‌ల‌ ఇతర భాషల నుంచి ఇన్స్పైర్ అయ్యి అదే కథతో సినిమాలు చేయటం కొత్తేమీ కాదు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే దేవర‌ సినిమాని కూడా కొరటాల సిసు సినిమా నుంచి తీసుకుని తెరకెక్కిస్తున్నారని అలా తెరకెక్కిస్తే ఎలాంటి ? అభ్యంతరం లేదు అన్నట్లుగా మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు కొరటాల ఎన్టీఆర్ తో చేయబోయి దేవర స్టోరీ ఏంటి ? అనేది ఎవరికీ చెప్పలేదు.. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఇలా ఏ ఒక్క విషయం గురించి కూడా క్లారిటీ లేదు.

NTR 30: NTR Jr, Janhvi Kapoor kick off their new film 'NTR 30' with a grand  opening ceremony - The Economic Times

అభిమానులు ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి స్పష్టత లేదు. కానీ సిసు సినిమా నుంచి ఇన్స్పైర్ అయి ఉంటే మాత్రం ఎన్ఠీఆర్‌ ఫ్యాన్స్ కి ఇక‌ పండగే అని సినిమా వ‌ర్గాలు అంటున్నాయి. కొర‌టాల ఈ సినిమాతో ఎన్టీఆర్ ను ఒక రేంజ్‌లో ఎలివేట్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే బాక్సాఫీస్ వ‌ద్ద బాక్సులు బ‌ద్ద‌ల‌వ్వ‌డం ఖాయం.