త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో బాల‌య్య‌.. అన్‌స్టాప‌బుల్ షోలో ఇచ్చిన మాట నిల‌బెట్టేసుకున్నాడా…!

నందమూరి నటసింహం బాలయ్య వరస సినిమాలతో ఫుల్‌స్వింగ్‌లో ఉన్నాడు. అఖండ‌, వీర‌సింహారెడ్డి లాంటి రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాల త‌ర్వాత బాల‌య్య జోష్ మామూలుగా లేదు. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న భ‌గ‌వంత్ కేస‌రి షూటింగ్ శ‌ర‌వేగంగా న‌డుస్తోంది. బాల‌య్య బ‌ర్త్ డే కానుక‌గా రిలీజ్ అయిన టీజ‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

Nandamuri Balakrishna says 'Babbai loved me more than his own kids' after controversy over ANR comment - India Today

ఇక భ‌గ‌వంత్ కేస‌రి సినిమాను ద‌స‌రాకు రిలీజ్ చేస్తున్న‌ట్టు టీజ‌ర్‌లో ప్ర‌క‌టించారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండ‌గానే బాల‌య్య 109వ సినిమా కూడా ప్రారంభోత్స‌వం రుపుకుంది. ఈ సంక్రాంతికి వాల్తేరు వీర‌య్య సినిమాతో హిట్ కొట్టిన యంగ్ డైరెక్ట‌ర్ కొల్లి బాబి ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ 109వ సినిమా పూజా కార్యక్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సందడి చేశారు.

బాలయ్యతో త్రివిక్ర‌మ్‌ మాట్లాడుతున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను సితార వాళ్లు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు క‌లిసి నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ – త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక త్రివిక్ర‌మ్ భార్య నిర్మాత అంటే త్రివిక్ర‌మ్ క‌థ‌, క‌థ‌నం విష‌యంలో చాలా బాగా ఇన్వాల్ అవుతారు.

thrivikram srinivas talking about ala vaikuntapuramlo - Cinevinodam

ఇది ఖ‌చ్చితంగా సినిమా విజ‌యంల కీల‌క‌మ‌వుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే అన్‌స్టాప‌బుల్ షోలో బాల‌య్య త్రివిక్ర‌మ్‌కు కాల్ చేసిన‌ప్పుడు మ‌నిద్ద‌రి కాంబినేష‌న్ ఎప్పుడు అని ప్ర‌శ్నిస్తే త్రివిక్ర‌మ్ మీ ఇష్టం సార్ మీరు ఎప్పుడు అంటే అప్పుడు అని చెప్పాడు. ఇలా త్రివిక్ర‌మ్ బ‌ల‌య్య‌ను డైరెక్టుగా డైరెక్ట్ చేయ‌క‌పోయినా ఈ సినిమాతో ప‌రోక్షంగా డైరెక్ట్ చేస్తున్న‌ట్టే గుస‌గుస‌లు వ‌స్తున్నాయి.