థ‌మ‌న్ పంపిన హోట‌ల్ బిల్ చూసి ఆ స్టార్‌ నిర్మాతకు నోట్లో మాటే రాలేదా..!

ఎస్ఎస్ థమన్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో హాట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఒక‌టి కాదు రెండు కాదు టాప్ హీరోలు, టాప్ ద‌ర్శ‌కుల కాంబినేష‌న్లో వ‌చ్చే అన్ని సినిమాలు ప్ర‌స్తుతం థ‌మ‌న్ చేతిలోనే ఉన్నాయి. షూటింగ్ ద‌శ‌లో ఉన్న సినిమాలే కాదు.. భ‌విష్య‌త్తులో సెట్స్ మీద‌కు వెళ్లే అన్నీ సినిమాలు కూడా థ‌మ‌న్ కింద‌కే వ‌స్తున్నాయి. థ‌మ‌న్ మ‌న‌సు పెట్టి ప‌ని చేస్తే చార్ట్ బ‌స్ట‌ర్ గ్యారెంటీ.. ఆర్ ఆర్ కూడా అదిరిపోతుంద‌న్న‌దే అంద‌రి న‌మ్మ‌కం.

Music Composer S Thaman Says His Wife 'Supremely Talented' But...

అస‌లు అఖండ సినిమాకు థ‌మ‌న్ ఇచ్చిన బీజీఎం దెబ్బ‌కు అమెరికాలోని థియేట‌ర్ల‌లోనే స్పీక‌ర్లు ప‌గిలిపోతున్నాయ‌ని.. అక్క‌డి మేనేజ్‌మెంట్లు బోర్డులు పెట్టి మ‌రీ సౌండ్లు త‌గ్గించేశారు. అంత గొప్ప వ‌ర్క్ థ‌మ‌న్ సొంతం. అయితే ఇటీవ‌ల కాలంలో థ‌మ‌న్‌కు ఎక్కువ ఛాన్సులు వ‌స్తుండ‌డంతో అంత‌గా కాన్‌సంట్రేష‌న్ చేయ‌డం లేద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

థ‌మ‌న్ అస‌లు ప‌నుల కంటే కొస‌రు ప‌నులు చేయ‌డం వ‌ల్లే స‌రైన మ్యాజిక్ ఇవ్వ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పైగా హోట‌ల్స్‌లో మ‌కాం వేయ‌డంతో పాటు అక్క‌డ కూడా టాప్ ప్లోర్‌లో ఎవ‌రితో అయినా బౌలింగ్ వేయించుకుంటూ మ‌రీ క్రికెట్ ఆడుతున్నాడ‌న్న కంప్లైంట్లు కూడా వ‌స్తున్నాయి. అస‌లు మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమాకు ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చింది కేవ‌లం ఒక్క పాటే అంటున్నారు.

S Thaman movies, photos and other details | Clapnumber

ఇక థ‌మ‌న్ వ‌ల్ల నిర్మాత‌ల‌కు భారీగా ఖ‌ర్చులు కూడా పెరిగిపోతున్నాయంటున్నారు. థ‌మ‌న్ స్టూడియో సెట‌ప్ అంతా హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్లో అంటున్నారు. ఒక సూట్ రూమ్‌తో పాటు కొన్ని రూమ్‌లు ముందుగానే బుక్ చేసుకున్నార‌ట‌. ఇటీవ‌లే థ‌మ‌న్ పేరుతో ఓ నిర్మాత‌కు రు. 40 ల‌క్ష‌ల బిల్లు అయ్యింద‌ట‌.

ఆ బిల్లు చూసి ఆ నిర్మాత గుడ్లు తేలేశాడ‌ట‌. థ‌మ‌న్ ఒకేసారి నాలుగైదు సినిమాల‌కు వ‌ర్క్ చేస్తూ ఉంటాడు. అయితే బిల్లులు మాత్రం థ‌మ‌న్ ఎవ‌రికి పంపితే వాళ్లే క‌ట్టాల‌ట‌. ఈ రూల్ చూసి టాలీవుడ్ నిర్మాత‌లు మా జేబుల‌కు బాగానే చిల్లులు ప‌డుతున్నాయ‌ని గొణుక్కుంటున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల భోగ‌ట్టా..!