తెలుగు సినిమా అనగానే ఒకప్పుడు అంటే.. దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు.. గోదావరి నది సెంటిమెంటు ఉండేది. ప్రతి సినిమాలోనూ ఒక్క సీన్‌లో అయినా.. గోదావరి నదిలో షూటింగ్ చేసేవారు. ఒక, శంకరా భర ణం, లేడీస్ టైలర్, సప్తపది సహా కొన్ని వందల సినిమాలను 1980-90ల మధ్య ఈ తీరంలోనే చిత్రీకరించా రు. రచయితలు కూడా.. అనేక పాటలు కట్టారు. గోదావరి నదిపై అనేక పాటలు కూడా వచ్చాయి.
అదేవిదంగా పాపికొండల దగ్గర షూటింగుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూగమనసులు సినిమా అంతా కూడా రాజమండ్రి పుష్కరాల రేవులోనే సాగింది. ఇక, కొన్ని కొన్ని సినిమాల్లో ప్రత్యేకంగా పాటల కోసం.. గోదావరి దగ్గర షూటింగులు చేసిన పరిస్థితి కూడా ఉంది. దర్శకుడు బాపు, కళాతపస్వి కే. విశ్వనాథ్, వంశీ.. సహా అనేక మంది దర్శకులు గోదావరి ఇతి వృత్తంతో సినిమాలు చేసిన పరిస్థితిని గమ నించాం.
కానీ,ఇటీవల కాలంలో సినిమాల్లో గోదావరి ప్రభావం తగ్గిపోయింది. గతంలో అయితే.. గోదావరి నదిపై సీన్ తీస్తే.. ఆ సినిమా సూపర్ హిట్టవుతుందనే సెంటిమెంటు కూడా ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొత్తంగా చూస్తే.. కృష్ణ, శోభన్‌బాబు వంటి వారు కూడా గోదావరి నదిలో షూటింగులు అంటే ఇష్టపడేవా రు. ఒక సందర్భంలో శోభన్‌బాబు అయితే.. ఏకంగా ప్రమాదానికి కూడా గురయ్యారని అంటారు. మొత్తంగా చూస్తే.. గోదావరి ప్రభావం ఇప్పుడున్న సినిమాలపైనా, ప్రేక్షకులపైనా కూడా తగ్గిందనే చెప్పాలి.