త్రివిక్ర‌మ్ – దేవీ గొడ‌వ‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసిన బాల‌య్య‌….!

జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్-దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో ఉన్నాయి. అయితే ఓ చిన్న విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డ్డ చిన్న గ్యాప్ పెరిగి అది పెరిగి పెద్ద‌ది అయ్యింది. ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్ గాసిప్పుల ప్ర‌కారం ఓ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల మీద త్రివిక్ర‌మ్ చెన్నై వెళ్లాడు. త్రివిక్ర‌మ్‌ను విప‌రీతంగా వెయిట్ చేయించాడ‌ట దేవి.

స్పీడుమీదున్న బాలయ్య బాబు.. ఘనంగా NBK109 ఓపెనింగ్

త్రివిక్ర‌మ్‌కు అస‌లే ముక్కుమీద కోపం.. ఈ కోపం త‌ట్టుకోలేకే దేవిని దూరం పెట్టేశాడు. త‌ర్వాత థ‌మ‌న్‌తో జ‌ర్నీ స్టార్ట్ చేశాడు. వ‌రుస హిట్లు ప‌డ్డాయి. కేవ‌లం త్రివిక్ర‌మ్ సినిమాలు మాత్ర‌మే కాకుండా ఆయనతో లింక్ వున్న ప్రతి సినిమా థమన్ చేతిలోకి వచ్చి ప‌డింది. ఇక గుంటూరు కారం సినిమాకు థ‌మ‌న్‌ను తీసుకోవ‌డం మ‌హేష్‌కు ఇష్టం లేదు. అయినా త్రివిక్ర‌మ్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ థ‌మ‌న్‌ను తీసుకునేలా మ‌హేష్‌ను ఒప్పించాడు.

అయితే ఇప్పుడు త్రివిక్ర‌మ్ – దేవి మ‌ధ్య ఉన్న గ్యాప్ బాల‌య్య ప్యాచ‌ప్ చేసేశాడంటున్నారు. బాల‌య్య అంటే మ‌ళ్లీ బాల‌య్య సినిమాతో వీళ్లిద్ద‌రు చేతులు క‌లుపుతున్నార‌ట‌. బాబీ-బాలకృష్ణ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాదే మ్యూజిక్ ఇస్తున్నాడ‌ని టాక్ వ‌స్తోంది. ఈ సంక్రాంతికి చిరు హీరోగా వ‌చ్చిన వాల్తేరు వీర‌య్య సినిమాకు బాబితో క‌లిసి వ‌ర్క్ చేశాడు దేవీ. సినిమా సూప‌ర్ హిట్‌.

బాలకృష్ణతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా ప్రారంభం - Mana Telangana

ఇక ఇప్పుడు బాల‌య్య – బాబీ సినిమా నిర్మాత‌ల్లో త్రివిక్ర‌మ్ కూడా ఒక‌రు. ఆయనకు ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్లో కూడా భాగస్వామ్యంలో ఉంద‌న్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డ ఏం జ‌రిగినా త్రివిక్ర‌మ్‌కు తెలియ‌కుండా జ‌ర‌గ‌దు. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా దేవిని ఫిక్స్ చేశారంటే త్రివిక్ర‌మ్ – దేవి మ‌ధ్య మొత్తానికి ఏదో రాజీ జ‌రిగింద‌న్న గుస‌గుస‌లే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉన్నాయి. ఇక భ‌విష్య‌త్తులో వీరిద్ద‌రు క‌లిసి ప‌నిచేయ‌డం ప‌క్కా..!