టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం వేడుక ఇండస్ట్రీలో హైలెట్ అయ్యింది. అయితే ఈ వేడుకకు అతికొద్దిమంది మెగా ఫ్యామిలీ సన్నిహితులు, బంధువులను మాత్రమే ఆహ్వానించారు. ఇక ఈ వేడక ఫొటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేడుకకు సంబంధించి వరుణ్ తేజ్ చెల్లి నిహారిక షేర్ చేసిన ఓ ఫొటోపై ఇప్పుడ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుకలో నిహారిక తన అన్న వరుణ్ తేజ్‌పై ఆప్యాయంగా తలవాల్చి ఉంది. అయితే ఈ ఫొటోలో నాగబాబు ఫ్యామిలీ అందరూ ఉన్నారు. ఇటు నిహారికకు వదిన కాబోతోన్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఉన్నారు. ఒక్క నిహారిక భర్త చైతన్య మాత్రమే మిస్ అయ్యాడు. ఇక గత కొంత కాలంగా నిహారిక, చైతన్య జంట విడిపోయారని విస్తృతంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఈ ప్రచారానికి బలం కలిగించేలా నిహారిక తన ఇన్‌స్టాలో తాజాగా షేర్ చేసిన ఈ ఫొటో చెప్పకనే చెపుతోందంటున్నారు. చైతన్య ఈ వేడకకు రాలేదు అన్న విషయాన్ని నిహారిక పరోక్షంగా చెప్పే క్రమంలోనే ఈ ఫొటో షేర్ చేసిందనే అందరూ అంటున్నారు. ఆమె ఇప్పటికే తన భర్తకు దూరంగా ఉండడంతో పాటు గ్లామర్ ప్రపంచానికి మళ్లీ ఆహ్వానం పలుకుతూ గేట్లు ఎత్తేసింది.
అప్పుడే ఆమె తన భర్తను రెచ్చగొడుతూ బిహేవ్ చేస్తుందన్న విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ ఫొటో తన ఇన్‌స్టాలో షేర్ చేయడం ద్వారా ఈ పెళ్లికి వరుణ్ రాలేదని చెప్పడమే ఆమె ఉద్దేశం కాగా… దాదాపు చైతన్యతో తాను తెగతెంపులు చేసేసుకున్నానని చెప్పి పరోక్షంగా చైతును టార్గెట్ చేసే క్రమంలోనే ఇలా చేసిందంటున్నారు.