బాలీవుడ్‌కి వెళ్లాక దాన్ని బాగా పెంచేసిన స‌మంత‌… !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పిచ్చ పాపుల‌ర్ అయ్యింది స‌మంత‌. ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో వివాహం.. నాలుగేళ్ల కాపురం విడాకుల త‌ర్వాత కూడా స‌మంత ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా విడాకుల త‌ర్వాత ఆమె ఎంత‌లా రెచ్చిపోతుందో చూస్తూనే ఉన్నాం. పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్‌తో మామూలు ర‌చ్చ లేప‌లేదు. ఆ త‌ర్వాత య‌శోద అనే థ్రిల్ల‌ర్ సినిమాతో పాటు శాకుంత‌లం లాంటి పౌరాణిక పాత్ర‌లోనూ న‌టించింది.

ఇటీవ‌లే మయోసైటిస్ వ్యాధికి గురైన తర్వాత సమంత ఇక సినిమాలో నటించదని .. పూర్తిగా సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌బోతోంద‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. అయితే ఆ వార్త‌లు అన్నీ ఫేక్ అంటూ కొట్టిపడేసిన సమంత బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంటోంది. త‌న అంద‌చందాలు విచ్చ‌ల‌విడిగా ఆర‌బోస్తూ మేకర్స్‌ను, ప్రేక్ష‌కుల‌ను కూడా క‌వ్విస్తోంది.

అయితే ఈ క్ర‌మంలోనే ఆమె రేటు బాగా పెంచేసిన‌ట్టు కూడా తెలుస్తోంది. స‌మంత ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు రు. 4 కోట్ల‌కు పైనే డిమాండ్ చేస్తోంద‌ట‌. ఈ వ‌య‌స్సులో ఆమెకు ఇది చాలా చాలా ఎక్కువ‌. అంటే ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ల‌కు స‌మానంగా ఆమె రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తోంది. సీటాడెల్ వెబ్‌సీరిస్ కోసం ఆమెకు ఏకంగా రు. 10 కోట్ల రెమ్యున‌రేష‌న్ ముడుతోంద‌ట‌.

బాలీవుడ్ మేక‌ర్స్ సంగ‌తి ఎలా ఉన్నా స‌మంత‌ను త‌మ సినిమాల్లో పెట్టుకోవాల‌న్న కోరిక ఉన్న టాలీవుడ్ మేక‌ర్స్ మాత్రం క‌ళ్లు తేలేస్తున్నార‌ట‌. స‌మంత‌ను త‌మ సినిమాల్లో తీసుకోవాల‌న్న ఆశ ఉంటుంది. అలాగ‌నీ అంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చుకోలేని ప‌రిస్థితి. స‌మంత ప్ర‌స్తుతం తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి సినిమాతో పాటు సీటాడెల్ వెబ్‌సీరిస్‌లోనూ న‌టిస్తోంది.