ఆ సినిమా ఒప్పుకుని విజ‌య‌శాంతి తప్పు చేసిందా..? ఒక్క దెబ్బతో టోటల్ కెరీర్ ఢమాల్..!!

అగ్ర‌ద‌ర్శ‌కుడు, క‌ళాత‌పస్వి.. కే విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా దేవాల‌యం. ఈ సినిమాకు చా లా హిస్ట‌రీనే ఉంది. ఇది కేర‌ళ‌లో వ‌చ్చిన మ‌ల‌యాళ మూవీని రీమేక్ చేశారు. క‌థ‌ను కొనుక్కున్న ద‌ర్శకు డు విశ్వ‌నాథ్ త‌న‌దైన శైలిలో మార్పులు చేశారు. ఇక‌, ఈ సినిమాలో తొలిసారి శోభ‌న్‌బాబు న‌టించారు. అంటే.. ఒక ఆధ్యాత్మిక సినిమాలో అందునా పూజారి వేషం. ముందు ఆయ‌న ఒప్పుకోలేదు. త‌ర్వాత‌.. మాత్రం ఒప్పుకొన్నారు.

Devalayam - Telugu Movie Review, Ott, Release Date, Trailer, Budget, Box  Office & News - FilmiBeat

ఇక‌, ఈ సినిమాలో విజ‌య‌శాంతి హీరోయిన్‌గా న‌టించింది. నిజానికి ఈ సినిమాలో భానుప్రియ‌ను అనుకు న్నారు. ఆమెతో రెండు రోజులుషూటింగ్ కూడా పూర్తి చేశారు. కానీ, కుటుంబంలో ఎదురైన ఒక ప్ర‌మాదం లో భానుప్రియ త‌న సోద‌రుడిని కోల్పోయారు. దీంతో ఆమె చాలా రోజులు షూటింగుకు దూరంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో నే విజ‌య‌శాంతిని ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసుకున్నారు. అయితే.. ఈ సినిమాలో తొలిసారి విజ‌య‌శాంతి .. డ్యాన్స‌ర్‌గా న‌టించింది.

పూర్తిస్థాయిలో భ‌ర‌త‌నాట్యం పాత్ర‌ను విజ‌య‌శాంతి పోషించ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. ఈ సినిమాలో ఫ‌స్ట్ హాప్‌లో విప్ల‌వ భావాలు, అభ్యుద‌య భావాలు ఉన్న హీరోగా న‌టించిన శోభ‌న్‌బాబు.. అప్ప‌టి వ‌ర‌కు దేవుడే లేడ‌ని వాద‌న వినిపిస్తాడు. కానీ, త‌ర్వాత మాత్రం ఆయ‌న సెకండ్ హాప్ విష‌యానికి వ‌చ్చేస‌రికి ఫుల్లుగా యూట‌ర్న్ తీసుకుని పూజారిగా ర‌క్తి క‌ట్టిస్తారు.

Devalayam (1985)

ఇక‌, విజ‌య‌శాంతి విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమాలో మంచి పేరు వ‌చ్చింది. కానీ.. సినిమాలు త‌గ్గిపోయాయి. అన్నీ క్లాసిక్స్ తీసేవారు కూడా లేక‌పోవ‌డం.. ఆమెకు ఆఫ‌ర్లు త‌గ్గాయి. దీంతో ఆ త‌ర్వాత స్వ‌ర్ణ క‌మ‌లం సినిమాను వ‌ద్ద‌ని చె ప్ప‌డం గ‌మ‌నార్హం.