“50 ఏళ్ళుగా క్రమం తప్పకుండా అదే పని”.. బాలీవుడ్ మీడియాని షేక్ చేస్తున్న అమితాబ్ టాప్ సీక్రేట్..!!

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచ‌యం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫాన్స్ ని సంపాదించుకున్న బిగ్ బి అమితాబ్ సినిమా వస్తుందంటే ఎంతో మంది అభిమానులు ఆ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అమితాబచ్చన్.. ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతున్న ప్రాజెక్టు కే లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాదులో ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో అమితాబ్ గాయపడ్డాడు. కొంతకాలం ఇంటి వద్ద ట్రీట్మెంట్ తీసుకున్న అమితాబ్.. ప్రస్తుతం సెక్షన్ 84 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే గత 50 ఏళ్లుగా ఒక పనిని మాత్రం క్రమం తప్పకుండా చేస్తున్నాడట అమితాబచ్చన్.

Amitabh Bachchan set to resume his meetings with fans on Sundays at Jalsa | Filmfare.com

ఇంతకీ ఏంటా పని అనుకుంటున్నారా.. అమితాబ్ స్టార్ హీరోగా మారిన టైం నుంచి ప్రతి ఆదివారం అభిమానులు అమితాబ్ ఇంటిదగ్గర ఆయ‌న‌ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అమితాబ్ ఆ సమయంలో బాల్కనీ బయటకు వచ్చి ఆమె అభిమానులందరికీ అభివందనం చేయడం అలవాటు చేసుకున్నారట. ప్రతి ఆదివారం అమితాబచ్చన్ ఎట్టి పరిస్థితిలోనూ బాల్కనీ వద్దకు వచ్చి అభిమానులకు అభివందనం చేస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోడ‌ట‌ అమితాబచ్చన్.

Amitabh Bachchan greets a sea of fans after a month on Sunday eve at Jalsa

అయితే అమితాబచ్చన్ ఈ విషయం గురించి ట్విట్ చేస్తూ ” నేను ఆ సమయంలో చెప్పులు కూడ వేసుకొను. ఆదివారం నా ఇంటి ప్రాంగణం దేవాలయంలా అభిమానులంతా దేవుళ్ళు లా ప్రత్యక్షమవుతారని వారికి అభివాదన‌లు చేసేటప్పుడు అందుకే కాళ్లకు చెప్పులు కూడా వేసుకోనని ..ఇది 50 ఏళ్ల సంవత్సరాల నుంచి నాకు సాంప్రదాయంగా మారిపోయింది” అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఆదివారం కనుక అభిమానులను కలవడానికి వీలు కాకపోతే రెండు, మూడు రోజులు ముందే సమాచారం అందజేస్తానని చెప్పుకొచ్చాడు అమితాబ్. దీంతో అమితాబచ్చన్ కు అభిమానులపై ఉన్న ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. అయితే అమితాబచ్చన్ కు సంబంధించి ఈ సీక్రెట్ రివీల్ కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..!!