లవ‌కుశ‌లో సీత‌గా అంజ‌లీదేవి ఎంపిక ఎన్టీఆర్‌కు ఇష్టం లేదా… ఆయ‌న చాయిస్ ఏ హీరోయిన్ అంటే..!

అన్న‌గారు ఎన్టీఆర్‌-అంజ‌లీదేవి రాముడు-సీత‌గా న‌టించిన ల‌వ‌కుశ చాలా హిట్ట‌యింది. ఈ సినిమా క‌థ ను రాసుకున్న ద‌గ్గ‌ర నుంచి అనేక వివాదాల చుట్టూ తిరిగింది. క‌థ‌లో అనేక మ‌లుపులు ఉన్నాయి. క్యారెక్ట‌ర్లు కూడా.. కుద‌ర‌లేదు. దీంతో అనేక మార్పులు చేశారు. ఇక‌, హీరోగా అన్న‌గారు రెడీ అయినా.. హీరోయిన్‌గా సావిత్రి మాత్రం ఒప్పుకోలేదు. అప్ప‌టికి ఆమె క‌మ‌ర్షియ‌ల్ మూవీల్లో బిజీగా ఉన్నారు.

Amazon.com: Lava Kusa Telugu Classical Movie : N T Rama Rao, Anjali Devi,  Chittor V. Nagaiah, T L Kanta Rao, Master Nagaraju, Master Subrahmanyam, A  Shankar Reddy, C. Pullaiah, Shankar Reddy A.:

 

పైగా.. మూడేళ్ల‌పాటు షూటింగు ఉంటుంద‌ని తెలిసి.. ఆమె కాల్‌షీట్లు ఇవ్వ‌లేదు. ముందు.. అన్న‌గారికి సీత వేషంలో సావిత్రి క‌నిపిస్తారండీ అని చెప్పారు. దీంతో ఆయ‌న ఓకేచేశారు. కానీ, ఆమె ఒప్పుకోలేదు. దీంతో భానుమ‌తిని సంప్ర‌దించారు. ఆమె కాద‌నే స‌రికి బీ. స‌రోజాదేవిని సంప్ర‌దించారు. ఆమె అప్ప‌టికి క‌న్న‌డ సినిమాల్లో బిజీగా ఉన్నారు. దీంతో చివ‌ర‌కు అంజ‌లీదేవిని సంప్ర‌దించారు.

 

ఆమె కూడా కాద‌న్నా.. నాగయ్య ఎంట్రీ ఇచ్చి.. అంజ‌లీదేవితో ఉన్న ప‌రిచ‌యాల కార‌ణంగా ఆమెను ఒప్పించారు. క‌ట్ చేస్తే.. అన్న‌గారికి విష‌యం తెలిసే స‌రికి కొంచెం లేటైంది. అంజ‌లీదేవి పొట్టిగా ఉంటారు కాద‌య్యా.. ఆమెనెలా తీసుకున్నారు? అని ప్ర‌శ్నించారు. కానీ, ద‌ర్శ‌కుడు పై ఉన్న న‌మ్మ‌కంతో సినిమాకు ఒప్పుకొన్నారు.

Lava Kusas' Unaware Of NTR | cinejosh.com

ఈ సినిమా.. అనేక అవాంత‌రాల‌ను ఎదుర్కొని.. ముందుకు సాగింది. ఎట్ట‌కేల‌కు మూడు న్న‌ర సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. విడుద‌లై బ్ర‌హ్మాండ‌మైన విజ‌యంఅందుకుంది. ఇప్ప‌టికీ.. అంజ‌లీదేవి ఇంట్లో..(ఆమె లేరు) నిలువెత్తు రామారావు-అంజ‌లేదేవి.. ప‌టం ఉంటుంది.