లావ‌ణ్య త్రిపాఠితో పెళ్లితో పాటు వ‌రుణ్‌తేజ్ ఫ్యాన్స్‌కు మ‌రో గుడ్ న్యూస్ ఇది..!

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వార్తల్లో ననుతున్నాడు. నిన్న మొన్నటివరకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్, పెళ్లి అంటూ వార్తల్లో నిలిచాడు. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి వార్తలు నిశ్చితార్థం వార్తలతో తెలుగు మీడియా నిండిపోయింది. ఇక సోషల్ మీడియాలో ప్రచారానికి అంతే లేకుండా పోయింది. అయితే మెగా అభిమానులు.. వరుణ్ అభిమానులకు ఇప్పుడు రెండు శుభవార్తలు అందుతున్నాయి.

TRENDING: Lavanya Tripathi and Varun Tej to get married? The former  clarifies! | JFW Just for women

ఒకటి లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ తో పాటు రెండోది ఈ ఏడాది వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గాండీవధారి అర్జున సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. గత ఏడాది ఎఫ్ 3, గని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. ఇందులో ఎఫ్ 3 సినిమా హిట్ అయింది. గణేష్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఎఫ్3 సినిమా హిట్ అయినా అందులో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నాడు. దీంతో సోలోగా హిట్ కొట్టలేకపోయాను అన్న బాధ వరుణ్ తేజ్ కు ఉంది. గని అయితే పెద్ద డిజాస్టర్ అయింది.అయితే ఇప్పుడు సోలో హీరోగా హిట్ కొట్టేందుకు గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు.

సీనియ‌ర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏది ఏమైనా వరుణ్ తేజ్ స్వల్ప రోజుల వ్య‌వ‌ధిలోనే రెండు శుభవార్తలతో అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు.