పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అనుష్క. ఆ సినిమా తర్వాత వరుస హిట్లతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మారింది. సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన అరుంధతి సినిమాతో ఒక్కసారిగా లేడీ సూపర్ స్టార్ గా మారింది అనుష్క. రాజమౌళి దర్శకత్వం వచ్చిన బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్ అయిపోయింది.
ఇలాంటి ఈ క్రేజీ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ రహస్యాన్ని బయటపెట్టింది. ఇన్ని సంవత్సరాలు బయటికి రాని ఓ నిజాన్ని ఆమె చెప్పింది. ముందుగా ఆమె ఒక లవ్ ప్రపోజల్ గురించి ఓపెన్ అయింది. తన మొదటి లవ్ ఎప్పుడు ఎక్కడ ? పుట్టిందో అనుష్క చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మాత్రం అందరూ షాక్ అవాల్సిందే.
అనుష్క తన మొదటి లవ్ ప్రపోజల్ స్కూల్ సమయంలో జరిగిందట. అనుష్క ఆరో తరగతిలోనే లవ్ ప్రపోజల్ ఎదుర్కొందట. తనతో పాటు చదివే ఓ అబ్బాయి తనకు లవ్ ప్రపోజ్ చేశాడంటూ ఆమె చెప్పింది. అతడు ప్రపోజ్ చేయగానే ఓకే చెప్పేసిందట అనుష్క. ఇక అది తన చిన్నప్పటి మధుర జ్ఞాపకంగా నిలిచిపోయిందని అనుష్క చెప్పుకొచ్చింది. గతంలో అనుష్కను జయప్రద ఇంటర్వ్యూ చేసిప్పుడు ఈ సీక్రెట్ బయటకు వచ్చింది.
ఇదే ఇంటర్వ్యూలో తనకు త్రిష, నయనతార అలాగే భూమిక అంటూ ఇష్టమని అనుష్క చెప్పుకొచ్చింది. తనకు మొబైల్ సరిగ్గా వాడటం రాకపోవడం పెద్ద వీక్‌నెస్ అని చెప్పింది. మొదటి సినిమా హీరో నాగార్జున గురించి చెబుతూ ఆయన చాలా పాజిటివ్.. కంఫర్ట్ గా ఉంటారని అనుష్క పేర్కొంది. అనుష్క ప్రస్తుతం కుర్ర హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి నటిస్తోంది. `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` సినిమా త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.