తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో నితిన్ కూడా ఒకరు. తేజ దర్శకత్వంలో 2002లో వచ్చిన జయం సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. హీరోగా మొదటి సినిమాతోనే తనలోని సైలెంట్ యాక్టర్ ని పరిచయం చేసి టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత దిల్ సినిమాతో తన నటనని మరో లెవల్‌కు తీసుకువెళ్లి డబుల్ స్టార్ డం అందుకున్నాడు. తర్వాత నుంచి హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయాడు.
ఇక ప్రస్తుతం ఒక్క హిట్ అందుకోవడానికి నితిన్ ఎన్నో కష్టాలు పడుతున్నాడు. రీసెంట్ టైమ్స్ లో హీరో నితిన్ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. గత రెండు సంవత్సరాలుగా నితిన్ హీరోగా హిట్ కొట్టిన సినిమా ఒక్కటంటే ఒక్కటి లేదు. ఈ హీరోని నమ్ముకుని స్టార్ హీరోయిన్లు కమిట్మెంట్లు ఇచ్చినా ఆ హీరోయిన్లకి నితిన్ ఐరన్ లెగ్ అనే ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాడు.
దీంతో ఏ హీరోయిన్ కూడా నితిన్‌తో రొమాన్స్ చేయడానికి అసలు ఇష్టపడటం లేదు. ఇప్పుడు నితిన్ కెరీర్ ఎందుకిలా మారింది..? అన్నది కూడా పెద్ద హాట్ టాపిక్కే. నితిన్ మంచి ఫామ్ లో ఉండగానే పలు డిఫరెంట్ సినిమాలు అంటూ తన బాడీ ఫిజిక్కు సూట్ అవ్వని స్టోరీలతో సినిమాలు చేసి భారీ డిజాస్టర్లు అందుకున్నాడు. అలాంటి సినిమాలు చేయటం వల్లే నితిన్ ఫేడవుట్ అయిపోయాడు.
ఇక అంతే కాకుండా తన కెరీర్ లో కొన్ని సినిమాల కథలను నచ్చకపోయినా ఫ్రెండ్షిప్ కోసం చేసి ప్లాప్లను తన ఖాతాలో వేసుకున్నాడు. నితిన్ చివరగా నటించిన హిట్ సినిమా అంటే భీష్మ గానే చెప్పుకోవాలి. ఆ తర్వాత నుంచి వచ్చిన ఏ సినిమాతోను హిట్ అందుకోలేకపోయాడు.. చూడాలి మరి హీరో నితిన్ ఎప్పుడు హిట్టు కొడతాడో..?