నందమూరి అభిమానులకు ఎవరు ఊహించని అదిరిపోయే అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య 108వ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య అభిమానులకు అదిరిపోయే న్యూస్ బయటికి వదిలారు ఈ సినిమా మేకర్స్. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య చేస్తున్న సినిమా టైటిల్ – ఫస్ట్ లుక్ అభిమానులకు అందించనున్నారు.
అది కూడా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న.. కానీ ఇప్పుడు దానికి రెండు రోజులు ముందుగానే ఈ అప్డేట్లు వచ్చేస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలోనే ఇప్పటివరకు ఏ సినిమాకు చేయని విధంగా.. మన తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 108 ఏరియాల్లో 108 భారీ హోర్డింగ్స్తో ఈ మాస్ టైటిల్ లాంచ్ చేస్తున్నారు. ఈ నెల 8న ఈ టైటిల్ లాంచ్ ముహూర్తం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.
పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి లాంటి వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న బాలయ్య హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
మరో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల కూడా బాలయ్య కూతురు పాత్రలో కనిపించనుంది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ సినిమాస్ నిర్మిస్తుండగా.. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.