వావ్ కేక‌రా… ప‌వ‌న్ – మ‌హేష్ మ‌ల్టీస్టార‌ర్‌… డైరెక్ట‌ర్ ఎవ‌రంటే…!

టాలీవుడ్ లోనే హెల్తీ రైవల్రీ అంటే పవన్ కళ్యాణ్- మహేష్ బాబు అభిమానుల మధ్య చూడాలి. ఒక హీరో రికార్డులను మరో హీరో బ్రేక్ చేయడం.. ఒక హీరో డిజిటల్ రికార్డులను ఇంకో హీరో బద్దలు కొట్టడం వంటివి మహేష్ – పవన్‌ మధ్య గత రెండు దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోల గురించి ఏ వార్త వచ్చిన అది నిమిషాల్లో వైరల్ గా మారుతుంది.

Pawan Kalyan And Super Star Mahesh Babu Were The First Choice For THIS Movie?

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సమయంలో కేవలం రీజనల్ సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేయటం మహేష్- పవన్ కళ్యాణ్ స్టైల్. ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీయే కాకుండా వీరిద్దరి మధ్య మంచి స్నేహం సంబంధం కూడా ఉంది. ఒక‌రి సినిమాల‌కు మ‌రొక‌రు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం, ఇత‌ర‌త్రా సాయాలు చేయ‌డం కూడా చూశాం. పైగా వీరిద్దరి కామన్ ఫ్రెండ్ త్రివిక్రమ్.

Trivikram Srinivas' team clarifies he's not on social media after this post went viral | Telugu Movie News - Times of India

ఇద్దరి హీరోల కాంబినేషన్లో మల్టీ స్టార‌ర్ సినిమా వస్తే చూడాలని టాలీవుడ్ మొత్తం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి మహేష్‌తో వాయిస్ ఓవర్ ఇప్పించిన త్రివిక్రమ్. ఇప్పుడు మళ్లీ త్రివిక్రమే ఇద్దరు హీరోలతో కలిసి సినిమా చేయాల‌ని ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ లేపుతున్నారు. కలలో కూడా ఊహించడం కష్టమైన‌ ఈ కాంబినేషన్ గురించి.. 10 సంవత్సరాల క్రితమే దర్శక ధీరుడు రాజమౌళి ఒక మాట చెప్పాడు.

SS Rajamouli explains how his version of Mahabharata will be a 10-part film: 'That is my dream' | Entertainment News,The Indian Express

2010 జూన్ 12 రాజమౌళి ట్విటర్లో ‘మహేష్‌- పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా ఒక కలలాంటిది.. ఆ కాంబినేషన్లో సినిమా కోరుకోవడం టూ మచ్ అనే అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టాడు’. 2010 సమయానికి రాజమౌళి వేరు.. ఇప్పుడు ఉన్న రాజమౌళి వేరు కాబట్టి. పవన్- మహేష్ కాంబోలో సినిమా చేయాలని ఆలోచన ఉన్నా అలాంటి కథ దొరకాలి. ఇద్దరు హీరోలని సరిగ్గా బ్యాలెన్స్ చేయ‌క‌పోతే అస‌లు ఫ్యాన్స్‌ను ఆప‌లేం.

10 Years Ago Today: Here's how Mahesh Babu wished Pawan Kalyan on his 39th Birthday | Telugu Movie News - Times of India

పవన్ – మహేష్‌కి ఇప్పుడున్న క్రేజ్, ఫ్యాన్ బేస్ దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ కాంబినేషన్ లో సినిమా చాలా క‌ష్టం. మరి జక్కన్న, సుకుమార్, త్రివిక్రమ్ లలో ఏ డైరెక్టర్ ఈ రిస్క్‌ చేస్తారో ? చూడాలి. ఒకవేళ వీళ్లని ఒప్పించి సినిమా చేయగలిగితే మాత్రం అది టాలీవుడ్ హిస్ట‌రీలోనే స‌రికొత్త రికార్డ్ అవ్వ‌డం ఖాయం.