టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న సినిమా భోళాశంకర్. టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ చిరుకు చెల్లిగా నటిస్తోన్న ఈ సినిమాకు డిజాస్టర్లతో ఇండస్ట్రీని బెంబేలెత్తించిన మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అసలే ఈ సినిమా కోలీవుడ్‌లో ఎప్పుడో పదేళ్ల క్రితం వేదాళం టైటిల్‌తో వచ్చింది.
అజిత్ హీరోగా చెల్లి సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమా తమిళంలోనే జస్ట్ యావరేజ్ మూవీగా నిలిచింది. దానిని తెలుగులో డబ్ చేసి వదిలేశారు. ఇక్కడ తెలుగు ప్రేక్షకులు చాలాసార్లు చూసేశారు. అయినా కూడా ఇప్పుడు ఇన్నేళ్లకు తెలుగులో రీమేక్ చేయడం.. అందులోనూ మెహర్ రమేష్ లాంటి డిజాస్టర్ డైరెక్టర్‌కు ఈ సినిమా బాధ్యతలు ఇవ్వడంతోనే మెగా ఫ్యాన్స్‌కు కూడా ఈ సినిమాపై ఏ మాత్రం ఆశలు లేవు.
అయితే చిరు చివరగా సంక్రాంతికి వాల్తేరు వీరయ్య లాంటి హిట్ సినిమా కొట్టి ఫామ్‌లో ఉండడం మాత్రమే ఈ సినిమాకు కాస్త ప్లస్ కానుంది. రీసెంట్‌గా భోళాశంకర్ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ భోళా మేనియా మంచి హిట్ అయ్యింది. ఈ క్రమంలోనే భోళాశంకర్ ఏపీ, తెలంగాణతో పాటు యూఎస్‌లోనూ మంచి బిజినెస్ జరుపుకోనుంది.
ఓవరాల్‌గా భోళాశంకర్ రీమేక్ సినిమా, అందరికి తెలిసిన కథే అయినా కూడా మెగాస్టార్ ఛరిష్మాతో రు. 80 కోట్లకు పైగా ప్రి రిలీజ్ జరుపుకోనుందని తెలుస్తోంది. ఒక్క ఏపీ నుంచే రు. 40 కోట్ల బిజినెస్ జరుగుతోందట. నైజాంలో ఇంకా బిజినెస్ క్లోజ్ కాకపోయినా భేరసారాలు మాత్రం ఓ రేంజ్‌లో నడుస్తున్నట్టుగా చెపుతున్నారు. ఏదేమైనా మెగాస్టార్ మానియా అయితే మామూలుగా లేదనే చెప్పాలి.