సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. మహేష్ తాను చేసే సినిమా కథలను ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మరి నిర్ణయం తీసుకొని సినిమాలు చేస్తారు. అయితే మహేష్ తన కెరీర్లో పలు సినిమాలకే ఓకే చెప్పాక షూటింగ్ స్టార్ట్ అయ్యి మధ్యలోనే ఆగిపోయినవి కూడా ఉన్నాయి.
మహేష్‌కు అతడు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్‌తో మహేష్ హరే రామ హరే కృష్ణ అనే సినిమా ప్రకటించారు. దీనికి యం ఎస్ రాజు నిర్మాతగా ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. అలాగే శివమ్ అనే పేరుతో క్రిష్ దర్శకుడి గా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా సోనాక్షి సిన్షా ను హీరోయిన్ గా కూడా కన్ఫామ్ చేశారు. ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లలేదు.
అలాగే మణిరత్నం – మహేష్ – విక్రమ్ కాంబినేషన్లో కూడా ఒక ప్రాజెక్ట్ ప్రకటించారు. అది మధ్యలో అగిపోయింది. అంతేకాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ సినిమా కూడా ప్రకటించారు. ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇక మరో యాక్షన్ దర్శకుడు వివి. వినాయక్‌తో కూడా మహేష్ సినిమా ఉందని చాలాసార్లు ప్రకటన వచ్చినా పట్టాలు ఎక్కలేదు.
అలాగే మహేష్ కు పోకిరి లాంటి మెమొరబుల్ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్‌తో జనగణమన సినిమా చేయబోతున్నాడు అంటూ పలు వార్తలు వచ్చాయి. ఇక ఇది కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇలా మహేష్ తన కెరీర్లో ఇలాంటి సూపర్ హిట్ కాంబినేషన్లలో తెరకెక్కాల్సిన పలు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి.