ఛ‌త్రిప‌తి సినిమా వ‌దులుకున్న స్టార్ హీరో… ఇంత‌క‌న్నా ద‌రిద్రం ఉంటుందా…!

ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి హిట్ సినిమాల‌లో ఛ‌త్ర‌ప‌తి ఒక‌టి. ప్రభాస్ – శ్రీయ జంటగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛ‌త్రపతి అప్ప‌టి వరకు చిన్న సినిమాలకు హీరోగా ఉన్న ప్రభాస్‌ను ఒక్క‌సారిగా స్టార్ హీరోగా మార్చేసింది. ఈ సినిమా వ‌చ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఇప్ప‌ట‌కీ చాలామంది ఆడియెన్స్‌కు బాగా గుర్తుండిపోయే సినిమా. ఛ‌త్రపతి మాస్ ఆడియన్స్ కైతే ఒక ప్రభంజనం.

Watch Chatrapathi - Disney+ Hotstar

ఈ సినిమా మొదటి హాఫ్ మొత్తం హై లెవెల్ మాస్ యాక్ష‌న్ తో… సెకండ్ హాఫ్ సెంటిమెంట్ ఎమోషనల్ సీన్ల‌తో ఉంటుంది. ప్రభాస్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమాను మొదటగా రాజమౌళి రవితేజతో తీయాలి అనుకున్నాడట. కానీ రవితేజ అప్పటికే మంచి ఫామ్ లో ఉండడంతో ఏడాదికి రెండు మూడు సినిమాల తో బిజీగా ఉండేవాడు. ఆ టైంలో మ‌రో రెండు మూడు సినిమాల‌కు డేట్లు ఇవ్వ‌డంతో ఛ‌త్ర‌ప‌తిని రిజెక్ట్ చేశాడట రవితేజ.

Happy Birthday Ravi Teja रवि तेजा एक फिल्म के लेते हैं इतने करोड़ फोर्ब्स की लिस्ट में हो चुके हैं शामिल - Happy Birthday Ravi Teja unknown facts about Ravi Teja personal

అప్పుడు రాజ‌మౌళి మ‌దిలో ప్ర‌భాస్ మెదిలాడు. అయితే ప్రభాస్ ని కలవడానికి రాజమౌళికి కాస్త భయం వేసేదట. ఎందుకంటే అప్పటికే స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి లాంటి సూపర్ హిట్ సినిమా కథలను రిజెక్ట్ చేశాడట ప్రభాస్. అయితే ఆ టైంలో ప్ర‌భాస్ బ‌ర్త్ డే రావ‌డంతో ఇండ‌స్ట్రీ వాళ్ల‌కు ఆహ్వానాలు పంపాడ‌ట ప్ర‌భాస్‌. ఆ బ‌ర్త్ డే ఆహ్వానం రావ‌డంతో అక్కడికి వెళ్లిన రాజమౌళి ఎలాగూ వచ్చాం కదా అని రిక్వెస్ట్ చేసి మ‌రుస‌టి రోజు ప్ర‌భాస్‌కు క‌థ చెప్పాడ‌ట‌.

Actor Ravi Teja Photo Gallery | Imágenes españoles

క‌థ విన్న వెంట‌నే ప్రభాస్ కి నచ్చిందట. అలా ఛ‌త్రపతి సినిమా ప్రభాస్ చేతికి వచ్చింది. రవితేజ ఛ‌త్రపతి సినిమా కూడా చేసి ఉంటే… అస‌లు ర‌వితేజ కెరీర్‌లో ఓ రేంజ్ ఉన్న సినిమా ప‌డిన‌ట్ల‌య్యి ఉండేది. ఈ సినిమా మిస్ చేసుకోవ‌డం ర‌వితేజ ద‌రిద్రం అనుకోవాలి. అయితే అదే రాజ‌మౌళి- ర‌వితేజ కాంబోలో విక్ర‌మార్కుడు సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.