మహానటి సావిత్రి న‌టించ‌ని ఏకైక పాత్ర అదే.. ఎంత విచిత్రం అంటే…!

మ‌హాన‌టి సావిత్రి అనేక పాత్ర‌లు పోషించారు. ఇటు పౌరాణికం.. అటు సాంఘికం.. ఇలా అనేక పాత్ర‌ల్లో ఆమె జీవించారు. దాసీగా, దేవ‌దాసీగా, వేశ్య‌గా కూడా ఆమె న‌టించారు. అయితే.. ఏ పాత్ర‌లో న‌టించినా.. ఆమె దానికి న్యాయం చేశార‌నే చెప్పాలి. అయితే.. ఎన్ని పాత్ర‌లు చేసినా.. ఆమె కు కూడా ఒక కొర‌త మిగిలిపోయింది. అదే.. సీతాదేవి పాత్ర‌. ఆమె త‌న జీవితంలో అనేక పాత్ర‌లు వేసినా.. సీతాదేవిగా మాత్రం న‌టించ‌లేదు.

Savitri: Five films of the late actress that are a must watch

ల‌క్ష్మిగా, స‌ర‌స్వ‌తిగా, పార్వ‌తీదేవిగా.. భూదేవిగా.. ఇలా అనేక చిత్రాల్లో నటించారు సావిత్రి. అయితే.. ఆమె కు సీతాదేవి పాత్ర‌లు వ‌చ్చినా..చేయ‌లేన‌ని చెప్పారు. వాస్త‌వానికి ల‌వ‌కుశ సినిమాలో ముందు సావిత్రినే అనుకున్నారు. ఈ క‌థ‌లో అన్న‌గారి స‌ర‌స‌న ఆమె అయితే.. బాగుంటుంద‌నే అంచ‌నాలు కూడా వ‌చ్చా యి. కానీ, ఆమె ఒప్పుకోలేదు. ఇక‌, త‌ర్వాత‌.. వ‌చ్చిన అనేక సినిమాల్లోనూ.. సావిత్రికి సీత పాత్ర వ‌చ్చినా.. ఆమె వ‌ద్ద‌న్నారు.

Lava Kusa Movie || Sita Devi Leave with Bhoodevi Sentiment Scene || NTR, Anjali  Devi - YouTube

త‌మిళంలో వ‌చ్చిన రామాయ‌ణే సినిమాలో భూమాత‌గా న‌టించారు త‌ప్ప‌.. సీతాదేవిగా ఆమె చేయ‌లేదు. దీనికికార‌ణం చెబుతూ.. సీతాదేవి పాత్ర‌లో అనేక క‌ష్టాలు ఉంటాయి. ఆ క‌ష్టాలు నేను భ‌రించ‌లేను. అందుకే ఆ పాత్ర నేను చేయ‌ను. అన్నారు. అయితే.. అనూహ్యంగా ఆమె జీవితం.. సీత‌క‌న్నా ఎక్కువ క‌ష్టాలు చ‌వి చూడాల్సి వ‌చ్చింది. జీవితంలో ఎన్నో మెట్లు ఎదిగిన‌.. సావిత్రి.. త‌ర్వాత‌.. అంతే ప‌త‌నానికి చేరుకున్న విష‌యం తెలిసిందే.