టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి ఓ ఇంటివాడు అయ్యాడు. తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు రక్షిత రెడ్డితో మొన్న రాత్రి 7 అడుగులు వేసాడు శర్వానంద్. రాజస్థాన్‍లోని జైపూర్ లో ఉన్న లీల ప్యాలెస్ లో రెండు రోజులపాటు ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది.
శర్వానంద్ రక్షితల వివాహానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు కూడా శర్వానంద్ రక్షితల వివాహ వేడుకలో భాగమయ్యారు. ఈ కొత్త జంటను ఆశీర్వదించారు.. ఇప్పటికే శర్వానంద్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. పెళ్లి తర్వాత ఈ కొత్తజంట హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట.
వేసవికాలం కాబట్టి మాల్దీవ్స్ బెస్ట్ ఆప్షన్ గా ఈ జంట ఎంచుకున్నారట.. ఇక ఆ వెనువెంటనే ఓ ఫారెన్ టూర్ కి కూడా వెళ్లనున్నారని తెలుస్తుంది.. ఈ నెల చివరి వారంలో ఈ జంట హనీమూన్ కోసం ఫ్లైట్ ఎక్కబోతున్నారని తెలుస్తుంది. ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన లాస్ట్ ఇయర్ ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అతి త్వరలో యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నాడు..!!