యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “దేవర” షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. జాన్వి కపూర్ – జూనియర్ ఎన్టీఆర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు. అయితే ఇప్పటికే హైదరాబాదులో “దేవర”కి సంబందించిన సనివేశాలు షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న “దేవర” సినిమా తదుపరి మూవీ సీన్స్ గోవాలో తీయాల్సి ఉంది.
దీనిలో భాగంగా ఎన్టీఆర్ గోవా వెళ్తున్నట్టు తెలుస్తుంది. గోవాలో ఒక పాటతో పాటు, యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నారని సమాచారం. కాగా ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ గత వారం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళుతూ కెమెరాకు దొరికాడు. అయితే ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కాగా ఫ్యామిలీతో దుబాయ్ వెకేషన్ కి వెళ్లిన ఎన్టీఆర్ శనివారం తిరిగి హైదరాబాద్ కు వచ్చారు.
అయితే వెకేషన్ కు వెళ్లేటప్పుడు ఫ్యామిలీతో కెమెరా కంటపడిన ఎన్టీఆర్ మరోసారి తిరిగి వస్తుండగా కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ కొడుకులతో దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ తన వ్యక్తిగత విషయాలను ఎంత గోప్యంగా ఉంచాలని చూస్తున్న సరే ఎదోవిధంగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో దొరికిపోతూనే ఉన్నాడు. ఫ్యాన్స్ ద్వారా నో సోషల్ మీడియా ద్వారానో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్స్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.