నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలయ్య గత కొంతకాలంగా వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా అఖండ, వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎన్.బి.కె 108 సినిమాపై బాలయ్య అభిమానులలో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు అనిల్ రావిపూడి.
ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను రీచ్ అయ్యే విధంగా ఈ సినిమాను రూపొందించడంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడట అనిల్. ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల 10వ తేది నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు ఉన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఇంట్రెస్టింగ్ పోస్టర్ లేదా వీడియోని రివిల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. బాలకృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా తాము సర్ప్రైజ్ ఇవ్వబోతున్నామని సోషల్ మీడియా ద్వారా నందమూరి ఫ్యాన్ తో పాటు ప్రేక్షకల్లు అలర్ట్ చేశారు మూవీ యూనిట్.
అయితే ఈ సినిమాలో బాలయ్యను 50 సంవత్సరాల వయసు దాటిన వ్యక్తిగా చూపించబోతున్నారు. కనుక ఈ సినిమాలో బాలకృష్ణ రోల్ ఎలా ఉంటుందనే దానిపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ కానున్న పోస్టర్ లేదా టీజర్ లో శ్రీ లీల కూడా ఉండబోతుందట. ఈ సినిమా లో బాలకృష్ణ కూతురుగా శ్రీ లీల నటిస్తుంది. అయితే బాలయ్య ఫ్యాన్స్ కు పుట్టినరోజు సందర్భంగా కూతురుతో కలిసి బర్త్డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఇక శ్రీలీల బాలయ్య కాంబినేషన్లో పోస్టర్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు అనే చెప్పాలి.