మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏంటో తెలుసా..

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్‌కు ఎవర్ గ్రీన్ అందగాడు. సీనియర్ హీరో కృష్ణ వారసుడిగా తెలుగులో హీరోగా అడుగుపెట్టిన మహేష్‌కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అమ్మాయిలు అయితే మహేష్ బాబు అంటే పడి చచ్చిపోతారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు త‌న కేరీర్‌లో 27 కు పైగా సినిమాలలో నటించాడు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌తో మ‌హేష్ న‌టిస్తోన్న సినిమా 28వ ది. మ‌హేష్ చేసిన సినిమాల‌లో కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి.

Ghajini (Telugu) telugu | Sun NXT

మహేష్ కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడు. ఆ సినిమాలు కూడా మహేష్ బాబు చేసి ఉంటే మహేష్ రేంజ్ మాములుగా ఉండేది కాదు. మరి మహేష్ చేతి దాక వచ్చి రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దం. ముందుగా సూర్య కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “గజిని” సినిమా ముందుగా మహేష్ దగ్గరికి వచ్చిందట. ఆ సినిమా ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ ఈ క‌థ ముందుగా చాలా మంది హీరోల‌కు చెప్పాడు. అందులో మ‌హేష్ కూడా ఉన్నాడు.

Idiot - Telugu Movie Review, Ott, Release Date, Trailer, Budget, Box Office  & News - FilmiBeat

అయితే హీరో గుండు కొట్టించుకునే కాన్సెఫ్ట్ మ‌హేష్‌కు న‌చ్చ‌లేదు. మహేష్ బాబు ఆ సినిమా తనకి సూట్ కాదని రిజెక్ట్ చేసాడట. రవితేజ హీరోగా వ‌చ్చిన‌ “ఇడియట్” సినిమా కూడా ముందుగా మహేష్ బాబు వ‌ద్ద‌కు వ‌చ్చిందే ఇది కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఇలా ఈ రెండు బ్లాక్ బాస్టర్ సినిమాలు మహేష్ దాక వచ్చి వెళ్ళిపోయి. ఇవే కాకుండా ఈ లిస్ట్ లో మరికొన్ని సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వ‌చ్చి సూపర్ డూపర్ హిట్ అయిన ఫిదా, లీడర్ సినిమాలు కూడా ముందుగా మహేష్ దగ్గరకు వచ్చి ఆయన నో చెప్ప‌డంతో వేరే హీరోలు చేయడం జరిగింది.

Fidaa Telugu Movie Review Rating Story Cast and Crew

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ నటించిన “మనసంతా నువ్వే” సినిమా కూడా ముందుగా మహేష్ దగ్గరికి వచ్చిందే. కానీ మహేష్ నో చెప్ప‌డంతో ఉదయ్ కిరణ్ హీరోగా ఈ సినిమా వ‌చ్చింది. అక్కినేని నాగ చైతన్య నటించిన తొలి హిట్ సినిమా ఏ మాయ చేసావే కూడా మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాలలో ఒకటి. అలాగే ప్రభాస్ కెరీర్ లో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్‌ హిట్ సినిమా వర్షం మొదట మహేష్ దగ్గరికి వచ్చినదట.

 

 

కానీ మహేష్ నో చెప్ప‌డంతో ఆ సినిమాను ప్రభాస్ చేసాడు. ఇవే కాకుండా “రుద్రమదేవి” సినిమాలో అల్లు అర్జున్ నటించిన గోనగన్నారెడ్డి క్యారెక్టర్ కూడా మహేష్ దగ్గరకు వచ్చింది. కానీ అది ఆయన రిజక్ట్ చేయడంతో బన్నీ ఆ సినిమాలో న‌టించ‌డు.. ఇలా మహేష్ బాబు కెరీర్ లో దాదాపు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు వదులుకోవాలిసి వచ్చింది. ఈ సినిమాలో కనుక మహేష్ బాబు ఆయన రేంజ్ మరో లెవల్లో ఉండేదని ఆయన అభిమానులు అనుకుంటున్నారు..!