తెలుగు సినిమాల్లో తనదైన శైలిలో రాణించిన ఊర్వశి శారద బాల నటిగానే సినిమాల్లోకి వచ్చిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే.. శోభన్‌బాబు సరసన ఆమె రెండు సినిమాల్లో నటించారు. మాన వుడు-దానవుడు, బలిపీఠం సినిమాల్లో ఊర్వశి శారదకు మంచి పేరు వచ్చింది. దీంతో ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాల్లోనూ ఆమె నటించారు.
మరీ ముఖ్యంగా పరుచూరి బ్రదర్స్ మాటలకు శారద అభినయం కలిసివచ్చి.. అనేక సినిమాలు హిట్ కొట్టాయి. ఈ నేపథ్యంలో 1980ల తర్వాత.. ఒక దశాబ్దం పాటు.. శారద లేని సినిమా లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. వందల సినిమాల్లో ఆమె నటించారు. అయితే.. ఆమెపై వ్యక్తిగతంగా కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ.. పెద్దగా పట్టించుకునేవారు కాదు. సినీమా హీరోతో ఆమె అప్పట్లో ప్రేమలో పడ్డారనే టాక్ నడిచింది.
ఇక, శారద ఒక లెక్చరర్‌ను వివాహం చేసుకున్నారు. ఇది కుటుంబ సభ్యులు కుదిర్చిన బంధమే. అయితే .. ఆయన తరచుగా షూటింగ్ స్పాట్‌లకు వచ్చేవారు. తమిళియన్. ఓ సందర్భంలో ఆయన షూటింగ్ స్పాట్‌లో ఉన్న సమయంలో క్యారెక్టర్ నటుడు కైకాల సత్యనారాయణ వచ్చారు. ఆయనకు శారద భర్త అనే విషయం తెలియదు. దీంతో ఆయనను నువ్వెవరు అంటూ ఏకవచనంతో సంబోధించారు.
దీంతో ఆగ్రహోదగ్రుడైన శారద భర్త.. కైకాలపై విరుచుకుపడ్డారు. విషయం తెలిసిన శారద.. జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చ జెప్పింది. ఈ సందర్భంగా కైకాల వెనక్కి తగ్గి శారద భర్తకు సారీ చెప్పారు. తర్వాత.. శారద దంపతులు.. కైకాలను ఇంటికి పిలిచి సత్కరించారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య స్నేహం చిగురించింది.