అన్నగారు ఎన్టీఆర్ సినీ కెరియర్ ని మలుపు తిప్పిన మూవీస్ ఇవే.. చరిత్రలో ఏ హీరో టచ్ చేయలేని రికార్డులు,,!!

నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు మన మధ్య లేకపోయినా సరే ఆయన సినిమాలు.. ఆయన చేసిన సేవలు ఎల్లవేళలా చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోతాయి. పాల వ్యాపారం నుంచి సినీ పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగిన ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించినా సరే ప్రతి ఒక్కరికి సహాయం చేసి దానధూతగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ కెరియర్లో 200కు పైగా చిత్రాలలో నటించిన ఈయన సాంఘికం, జానపదం , పౌరాణికం, చారిత్రక వంటి చిత్రాలలో ఆయా పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కృష్ణుడిగా, రాముడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా, దుశ్యాసనుడిగా కూడా ప్రేక్షకులను అలరించిన ఎన్టీ రామారావు సినీ జీవితంలో కొన్ని పౌరాణిక చిత్రాలు మాత్రం చరిత్ర ఉన్నంతవరకు శాశ్వతంగా నిలిచి ఉంటాయని చెప్పవచ్చు.

మాయాబజార్:
యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం అయినా మాయాబజార్ సినిమాలో ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి వెంకట్రామయ్య , సావిత్రి తదితరులు ముఖ్యపాత్రలో నటించి సినిమాకే ప్రాణం పోశారు. వెంకటరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత బి నాగిరెడ్డి నిర్మించగా.. సంగీత దర్శకుడు ఘంటసాల స్వరాలు సమకూర్చారు. ఇప్పటికీ కూడా ఈ చిత్రం ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది.

దానవీరశూరకర్ణ:
1977లో ఎన్టి రామారావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది. ఇందులో జయప్రద, ఎన్.టి.రామారావు , రాజనాల, హరికృష్ణ, ప్రభాకర్ రెడ్డి, బాలకృష్ణ, జెపి శర్మ, శారద, గుమ్మడి చలపతిరావు, కైకాల సత్యనారాయణ, సరోజా దేవి, జగ్గారావు తదితరులు కీలక పాత్రలు పోషించి మెప్పించారు.

లవకుశ:
1963 లో డ్రామా మ్యూజికల్ ఎంటర్టైనర్ చిత్రంగా వచ్చిన లవకుశ చిత్రానికి సి పుల్లయ్య , సి.ఎస్.రావు కలిసి సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. శంకర్ రెడ్డి నిర్మించారు. ఘంటసాల స్వరాలు అందించిన ఈ చిత్రంలో ఎన్టీరామారావు , అంజలీదేవి, చిత్తూరు నాగయ్య , కాంతారావు, శోభన్ బాబు, సూర్యకాంత, కైకాల సత్యనారాయణ ఇలా ఎంతోమంది సినిమాలో నటించి సినిమాకు ప్రాణం పోశారు.

నర్తనశాల:
1963 లో పౌరాణిక ఎంటర్టైనర్ చిత్రంగా వచ్చిన నర్తనశాల సినిమాలో ఎన్టీ రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు ,రేలంగి, ప్రభాకర్ రెడ్డి, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య , కైకాల సత్యనారాయణ తదితరులు నటించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను లక్ష్మీరాజ్యం, శ్రీధర్ రావు సంయుక్తంగా నిర్మించారు.

ఇక వీటితోపాటు శ్రీకృష్ణార్జునయుద్ధం , శ్రీకృష్ణసత్య, శ్రీ వెంకటేశ్వర మహత్యం , బట్టి విక్రమార్క, గులేబకావళి కథ, మహామంత్రి తిమ్మరసు, దక్షయజ్ఞం, పాండవ వనవాసం, వీరాభిమన్యు, శ్రీ కృష్ణ పాండవీయం , శ్రీకృష్ణ తులాభారం ఇలా పలు చిత్రాలు ఎన్టీఆర్ సినీ కెరియర్ లో చారిత్రకంగా నిలిచిపోయాయి.