తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని అగ్ర హీరోలుగా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోలగా కొనసాగుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఇద్దరి అగ్ర హీరోల కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా వస్తే చూడాలని టాలీవుడ్ మొత్తం ఎంత ఆసక్తిగా.. ఎదురుచూస్తుంది. కానీ ఆ సమయం మాత్రం రావడం లేదు.
ఇదే సమయంలో గతంలో వీరిద్దరి కాంబోలో ఓ సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమా మిస్సయ్యిందని చాలామందికి తెలియదు. ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో అపూర్వ సహోదరులు మూవీ కూడా ఒకటి.. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించాడు.. బాలకృష్ణకు జంటగా విజయశాంతి, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమా 1986లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. అయితే ఈ సినిమాని ముందుగా ఓ భారీ మల్టీస్టారర్ సినిమాగా అనౌన్స్ చేశారట. రాఘవేందర్రావు చిరంజీవి, బాలకృష్ణలతో ఈ సినిమా చేయాలని అనుకున్నారు.. అందులో భాగంగానే ఇద్దరు హీరోలకు సినిమా కథ మొత్తం చెప్పగా.. ఇద్దరు హీరోలు కూడా ఓకే చెప్పారు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే సమయంలో బాలయ్య- చిరంజీవి ఇద్దరు ఒకే రకమైన డ్రస్సులను వేసుకుని అందర్నీ ఆకట్టుకున్నారు.
అదే సమయంలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అనగా చిరంజీవి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.. చిరు ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నాడో మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు.. చిరంజీవి ఆ సినిమా నుంచి తప్పుకున్న.. బాలయ్య మాత్రం ససిమేరా వెనక్కు తగ్గలేదు.. చిరు పాత్రను కూడా ఆయనే పోషించాడు.. తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.. అదే సమయంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన తొలి సినిమా సినిమా కూడా ఆపూర్వ సహోదరులే..ఈ విధంగా చిరు, బాలయ్య కాంబోలో రావలసిన ఓ బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్‌ను టాలీవుడ్ మిస్ అయింది.