సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ పరంగా ఎంత సక్సెస్ అయినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఫెయిల్ అయిన విషయం అందరికీ తెలిసిందే.. అక్కినేని హీరో నాగచైతన్యతో చాలాకాలం ప్రేమాయణం నడిపి.. 2017లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరు వివాహం జరిగింది.. ఇక పెళ్లయిన కేవలం నాలుగు సంవత్సరాలకే ఇద్దరు కలిసి ఉండలేక సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.
ఇక ఇప్పుడు సమంతాలనే మరో సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార జీవితం కూడా మారబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సౌత్ ఇండియాలో తిరిగి లేని స్టార్ హీరోయిన్గా ఇమేజ్ సొంతం చేసుకున్న నయనతార.. కోలీవుడ్ స్టార్ట్ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ఏడేళ్లగా ప్రేమించి.. గత సంవత్సరం వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు.. పెళ్లయిన నాలుగు నెలలకే వీరిద్దరకు సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించారు.
నయనతార ఒకవైపు భర్త పిల్లలతో తన ఫ్యామిలీ లైఫ్ ను ఎంతో జాలిగా ఎంజాయ్ చేస్తుంది.. అదే సమయంలో వరుస సినిమాలు చేస్తూ తన కెరీర్ని కూడా కొనసాగిస్తుంది. ఇక ఇప్పుడు ఇదే సమయంలో నయనతార తన భర్తతో ఎక్కువ రోజులు కలిసి ఉండలేదని.. వారి దాంపత్య జీవితం సర్వనాశనం అవబోతుందని.. వీరిద్దరూ వ్యక్తిగత విభేదాలతో విడాకులు తీసుకోబోతున్నారు అని .. గతంలోనే ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పుకొచ్చాడు.
ఏ సెలబ్రిటీ అడగకపోయినా వారి జ్యోతిష్యం చెప్పే వేణు స్వామి.. సమంత- నాగచైతన్య పెళ్లి సమయంలోనే వీరిద్దరూ విడిపోతారని ముందే వారి జాతకం చెప్పాడు.. ఆయన చెప్పిన విధంగానే సమంత- నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. ఇక దీంతో ఈయన జ్యోతిష్యం బాగా పాపులర్ అయింది. అప్పట్నుంచి వేణు స్వామిని చిత్ర పరిశ్రమలో ఉన్నవారు చాలామంది నమ్మటం మొదలుపెట్టారు.. స్టార్ హీరోయిన్ ల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ ఆయన చేత జాతకాలు పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు.
ఇక ఇదే సమయంలో నయనతార విఘ్నేష్ శివన్ పెళ్లి సమయంలోనే వేణు స్వామి వారి జాతకం చెప్పాడు.. నయనతార కు వివాహ గండం ఉందని.. ఈమె వివాహ బంధం ఎక్కువ కాలం ఉండదని చెప్పుకొచ్చాడు.. నయనతార తన భర్తతో ఈ విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కుండ బద్దలు కొట్టేసాడు.. ఇక దీంతో వేణు స్వామిని చాలామంది ఆ సమయంలో తప్పుబట్టారు.. శుభమా అని పెళ్లి చేసుకుంటే విడాకులు తీసుకుంటారు అని అశుభంపలుకుతావేంటయ్య అంటూ ఆయనను విమర్శించారు.. అప్పట్నుంచి వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం నిజం కాకూడదని నయనతార అభిమానులు కోరుకుంటున్నారు. రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూడాలి.