తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దగ్గుబాటి రామానాయుడు భారతదేశంలోనే అన్ని భాషలలో సినిమాలు నిర్మించిన అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.. ఆయన తర్వాత ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఆయన పెద్ద కొడుకు డి సురేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలోనే దిగజ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.. ఆయన చిన్న కొడుకు విక్టరీ వెంకటేష్ కూడా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.
ఇక ఇప్పుడు ఈ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరోలలో ఇప్పటికే దగ్గుబాటి రానా తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో తన నటనతో మెప్పించాడు. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి మరో నటుడు దగ్గుబాటి అభిరామ్.. విలక్షణ దర్శకుడు తేజ తెరకెక్కించిన అహింసా సినిమాతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచి భారీ నెగటివ్ టాక్ ను తెచ్చుకొని తొలి సినిమాతోనే భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు అభిరామ్.
మరీ ముఖ్యంగా ఈ సినిమా తేజ దర్శకత్వంలో వచ్చిన గత సినిమాలు జయం, నువ్వు నేను సినిమాల మాదిరిగానే చాలా సీన్స్ ఉండటంతో ప్రేక్షకులకు ఈ సినిమా తలనొప్పి తెప్పించింది. అదేవిధంగా ఈ సినిమా చూసిన జనాలు మాత్రం దండం పెడుతూ ఈ సినిమాకు వెళ్ళకండి రా బాబు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో తేజ ఈ సినిమా కథను ఈ దగ్గుబాటి హీరో కోసం కాకుండా మరో టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు కోసం రాసుకున్నారట.
మరి ఆ స్టార్ హీరో మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ. ఆయన తనయుడు మోక్షజ్ఞ కోసం తేజ ఈ సినిమా కథను రాసుకున్నారట. ఇదే కథను దర్శకుడు తేజ బాలయ్య వద్దకు తీసుకువెళ్లి చెప్పాడట.. అదే సమయంలో దర్శకుడుని బాధ పెట్టకూడదు అన్న భావనతో ఈ సినిమా కథను మొత్తం వినడానికి రెడీ అయ్యారట.. ఈ సినిమా కథ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవ్వగానే అహింస సినిమా దొబ్బేస్తుందని మొహం మీదే చెప్పేసాడట బాలయ్య.
కథలో హీరో క్యారెక్టర్ కు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో సినిమా కథనంలో పస లేకపోవడంతో బాలయ్య తేజ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారట. అంతేకాకుండా ఈ సినిమా ఏ హీరోతో చేసిన అది ప్లాప్ అవుతుంది అంటూ అప్పుడే మొహం మీదే ఓపెన్ గా చెప్పేసాడట. అయితే ఆ సమయంలో ఈ విషయాన్ని లైట్ తీసుకున్న తేజ.. ఆ తర్వాత దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేయడానికి ఈ కథను వాడుకున్నాడు. ఓవరాల్ గా దగ్గుబాటి అభిరామ్ కు ఈ సినిమాతో ప్లాప్ ఇచ్చాడు. ఇక దీంతో బాలకృష్ణ సైతం నా కొడుకు బ్రతికి పోయాడు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు అంటూ ఎంతో ఆనందించారట.. ప్రస్తుతం ఇదే వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.