మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. వాటిలో ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు ఇప్పటికీ అలా గుర్తుండిపోయాయి. అలాగే ప్రతి హీరో కెరీర్‌లోను అలాంటి కొన్ని సినిమాలు ఉంటాయి. అలానే మెగాస్టార్ చిరంజీవి నటించిన చాలా సినిమాల్లో ‘పున్నమి నాగు’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో చిరు నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాతో చిరంజీవికి మంచి పేరు కూడా వచ్చింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఏవిఎం’ వారు నిర్మించారు.
ఈ సినిమాను ఏవీఎం బ్యానర్ లోనే తీయడానికి ఓ పెద్ద కథ నడిచిందట. ఇక ఇదే విషయాన్ని రీసెంట్గా ‘ఏవిఎం’ బ్యానర్ నాలుగో తరం నిర్మాత అరుణ గుహన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ‘పున్నమి నాగు’ సినిమా వెనక ఇంతకథ నడిచిందా ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న ఏవీఎం ప్రొడక్షన్స్.. ఈ బ్యానర్ నుంచి ఎన్నో వందల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఈ బ్యానర్ ద్వారానే ఎందరో నటలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆనాటి దిగ్గజ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి అగ్ర హీరోలతో ఈ సంస్థ ఎన్నో సినిమాలను తెరకెక్కించింది. అయితే రీసెంట్‌గా ఈ సంస్థ నాలుగో తరం నిర్మాత ‘పున్నమి నాగు’ సినిమా సమయంలో జరిగిన ఆసక్తికర విషయాలను అరుణ గుహన్ చెప్పారు.
ఎన్నో వందల సినిమాలు తెరకెక్కించిన ఏవీఎం సంస్థ 1976 తర్వాత సినిమాలు చేయటం మానేసింది.. అదే సమయంలో ఆ సంస్థ స్థాపించిన ఏ.వి.మెయ్యప్పన్ ఆరోగ్యం కూడా క్షమించింది.. ఆ తర్వాత ఆయన 1979లో మరణించారు. ఆయన మరణించక ముందే చిరంజీవితో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆయన మరణించిన తర్వాత చాలా కాలం వరకు ఈ సంస్థ నుంచి సినిమాలు రాలేదు. ఏ.వి.మెయ్యప్పన్ చనిపోవటానికి ముందే తన కొడుకులతో ఈ సంస్థను యథావిధిగా కొనసాగించాలని మాట తీసుకున్నారట.
వారు తండ్రికి ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన సంవత్సరికం సందర్భంగా ఓ సినిమా చేయాలని భావించారు. అందుకు చిరంజీవిని కలిసి అడిగారు.. ఆ సమయానికి చిరంజీవి ఫుల్ బిజీగా కొనసాగుతున్నారు.. చిరుకు పెళ్ళికూడాా అయింది. చిరంజీవి తమ సంస్థలో సినిమా చేయాలనేది తమ తండ్రి చివరి కోరిక అని చెప్పడంతో చిరు వెంటనే ఒప్పుకున్నారు. ఏవీఎం సంస్థ అడగానే సినిమా ఓకే చేశారు చిరంజీవి. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఈ మూవీ షూటింగ్లో మాత్రం రాత్రిపూట ఎక్కువగా పాల్గొనే వారట.. ఆ విధంగా ఈ సినిమాను పూర్తి చేశారట.
ఈ సినిమాకి ‘పున్నమి నాగు’ అనే పేరు కూడా చిరంజీవినే పెట్టారట. ఈ సినిమా తెలుగులో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఆరోజుల్లోనే తెలుగులో ఏవీఎం ప్రొడక్షన్ కు భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టిన చిత్రంగా పున్నమినాగు మిగిలింది.. ఇక ఈ విషయాలని ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ సంస్థ నిర్మాతల్లో ఒకరిన అరుణ గృహన్ స్వయంగా చెప్పడంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.