రకుల్ ప్రీత్ సింగ్ పంజాబీ ముద్దుగుమ్మ అయినా ఈ భామ 2015లో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది దాదాపు నాలుగేళ్లపాటు టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోలతో నటిస్తూ ఒక ఊపు ఊపేసింది. క్రేజీ హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, రామ్ ఇలా వరుస పెట్టి అందరి హీరోలతో నటించేసింది.
తెలుగు ప్రేక్షకులు ఆమెను నెత్తిన పెట్టుకున్న టైం లోనే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలగాలని ముంబైకి మకాం మార్చేసింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించడంతోపాటు ఒకటి రెండు హిట్లు పడినా అనుకున్నట్టుగా సక్సెస్ కాలేదు. దీంతో ఆమె తిరిగి తెలుగులోకి వచ్చిన అప్పటికే ఇక్కడ పోటీ ఎక్కువగా ఉండడంతో రకుల్‌ను టాలీవుడ్ జనాలు పట్టించుకోలేదు. ఆతర్వాత ఆమె ఫేడ్ అవుట్ కూడా అయిపోయింది.
అయినా రకుల్ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. అయితేరకుల్ కొద్ది రోజులుగా తన ప్రియుడు జాకీభగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతోంది. వీరిద్దరు కలిసి డేటింగ్ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉండడంతో పాటు కలిసే ఉంటున్నారు. రకుల్‌కు సినిమా ఛాన్సులు తగ్గిపోవడంతో ఇప్పుడు ఆమె పలు బిజినెస్‌ల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఇప్పటికే చాలా నెలలుగా ప్రియుడితో అనధికారికంగా సంసారం చేస్తోన్న ఈ అమ్ముడు ఇప్పుడు తన బంధాన్ని అధికారికం చేసుకోవాలని ఆరాట పడతోంది. ఈ క్రమంలోనే వచ్చే నెలలోనే రకుల్ తన ప్రియుడు జాకీని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై రకుల్ స్నేహితులు హింట్ ఇచ్చేస్తున్నారట.
రకుల్ ఇంకొద్ది రోజులు పెళ్లి మ్యాటర్ సస్పెన్స్‌లో ఉంచాలనుకున్నా ఆమె ఫ్రెండ్స్ మాత్రం ఈ విషయం చెప్పేసి రకుల్‌ను బుక్ చేసేశారు. దీంతో ఇప్పుడు రకుల్ తన పెళ్లిపై అధికారికంగా చెప్పక తప్పని పరిస్థితి. ఏదేమైనా మొత్తానికి రకుల్ ఓ ఇంటిది అవుతోంది.