మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఈ నెల 9న ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇక లావణ్య- వరుణ్ ఇద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య పాత స్నేహం బలపడి ప్రేమగా మారింది. లావణ్యతో వరుణ్ తేజ్ పెళ్లిని మెగా ఫ్యామిలీ అంతగా ఇష్టపడలేదని తెలుస్తోంది.
మెగా ఫ్యామిలీలో మామూలు బంధాలే కాదు సినిమా వాళ్ళ బంధాలు కూడా అంతగా నిలవడం లేదు. వరుణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ తనతో పాటు నటించిన ఇద్దరు హీరోయిన్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇందులో రేణు దేశాయ్ ఇప్పటికే విడాకులు ఇచ్చేశాడు. మూడో భార్యతో పవన్ సంసారం అంతంత మాత్రమే ఉందని అంటున్నారు. దీనికి తోడు మరో హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా పవన్ కళ్యాణ్ పై ఎన్నో విమర్శలు చేశారు.
ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటున్నాడు. మధ్యలో మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా రెజీనాతో నడిపిన ప్రేమాయణం మెగా ఫ్యామిలీకి నచ్చలేదని.. మెగా ఫ్యామిలీ తీవ్రమైన ఒత్తిడి చేసి సాయి తేజ్ – రెజీనా బంధాన్ని బ్రేకప్ చేశారన్న ప్రచారం కూడా ఉంది. ఏది ఏమైనా సినిమా వాళ్ళు తమ ఇంటి కోడలుగా రావడం మెగా ఫ్యామిలీకి అస్సలు ఇష్టం లేదు.
ఇప్పుడు వరుణ్ తేజ్ విషయంలోనూ వాళ్ళకి ఇష్టం లేకపోయినా వరుణ్ కోసం అనేక కండిషన్లు పెట్టి లావణ్యను తమ ఇంటి కోడలుగా చేసుకునేందుకు అయిష్టంగానే ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ మాటకు వస్తే మెగా ఫ్యామిలీలో కేవలం సినిమా వాళ్ళ బంధాలు మాత్రమే కాదు.. బయట వ్యక్తులను పెళ్లి చేసుకున్న ఆ బంధాలు కూడా అంతగా నిలబడని విషయం చూస్తూనే ఉన్నాం.