‘ అమరావతికి అటు ఇటు ‘ టైటిల్ ఆ భయంతోనే మహేష్ పక్కన పెట్టాడా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు గుంటూరు కారం టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ గ్లిమ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ గుంటూరు కారం గ్లిమ్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. పూజ హెగ్డే, శ్రీలీల‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Mahesh Babu's next titled Guntur Kaaram, Highly inflammable - JSWTV.TV

ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు ముందుగా మూడు టైటిల్స్ పరిశీలించారు. ఆ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ అమరావతికి అటు ఇటు అనే టైటిల్ పెడతారని కూడా ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ కూడా ఇదే టైటిల్ పెట్టాలని డిసైడ్ అయ్యారట. అయితే సడన్ గా గుంటూరు కారం టైటిల్ ఖరారు చేస్తూ టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్ ఎందుకు ?పక్కన పెట్టాడు అన్న గుసగుసలు కూడా నడుస్తున్నాయి.

అయితే అమరావతికి అటు ఇటు టైటిల్ పెట్టాలని ముందుగా అనుకున్న ఈ టైటిల్ పెడితే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొందరి నుంచి వ్యతిరేకత వస్తుందన్న కారణంతో గుంటూరు కారం టైటిల్ ఫిక్స్ చేశారని అంటున్నారు. అలాగే అమరావతి టైటిల్ పెడితే అది ఒక ప్రాంతానికే పరిమితమైనట్టుగా ఉందని.. అందుకే ఆ టైటిల్ వద్దని మహేష్, త్రివిక్రమ్ కు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

Upcoming actress targets Trivikram Srinivas | cinejosh.com

అమరావతికి అటు ఇటు టైటిల్ వద్దని మహేష్ చెప్పినప్పుడు త్రివిక్రమ్ సూచించిన టైటిల్స్ లో గుంటూరు కారం మహేష్ కు బాగా నచ్చడంతోనే చివరకు ఆ టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఆ టైటిల్ తోనే మహేష్ మాస్ స్ట్రైక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి సరికొత్త ఉత్సాహం తీసుకువచ్చారు. మరి ఈ గుంటూరు కారం టైటిల్ ఎలాంటి ? బ్లాక్ బస్టర్ కొడుతుందో చూడాలి.