ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ‘ ఆదిపురుష్‌ ‘ ..అప్పుడే అన్ని కోట్లు రాబట్టిందా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన సినిమా ఆదిపురుష్‌, రామాయణంలోని కొన్ని ఘట్టాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రభాస్ తో పాటు ఈ సినిమా యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్లు చేస్తున్నారు.

 

ప్రభాస్ రాముడిగా, కృతి సీతగా నటిస్తున్న ఈ సినిమాపై ఆస‌క్తి నెలకొంది. కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా ఆడియన్స్ కూడా ఆదిపురుష్‌ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఊహించని రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇది ఇప్పటికే సెన్సేషన్ గా మారింది అటు నార్త్ లోను ఈ సినిమాను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు హక్కులు నాన్ థియేటర్ల్ హక్కులతో కలిపి ఏకంగా రూ.400 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకు అయిన ఖర్చుతో పోలిస్తే చాలా మొత్తం ఈ హక్కులతోనే రికవరీ అయినట్టు తెలుస్తోంది.

Prabhas' Adipurush Teaser Review

ఇక రిలీజ్ అయ్యాక ఆదిపురుష్‌ ఏ రేంజ్ లో రాబడుతుందో ? చూడాలి రాధేశ్యామ్‌ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భారీ అశ‌లు పెట్టుకున్నారు.