ఇంట్రెస్టింగ్: యంగ్ హీరో విశ్వక్ సేన్ అసలు పేరు ఏమిటో తెలుసా..? ఎందుకు మార్చుకున్నాడంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో మాస్కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.. తన సినిమాలతో టాలీవుడ్ లోనే మంచి మాస్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు.. హీరో గానే కాకుండా దర్శకుడుగా కూడా మంచి ఫేమ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్గా దాస్కా దమ్ కి సినిమాతో దర్శకుడుగా సూపర్ హిట్ అందుకున్నాడు.. అయితే విశ్వక్ సేన్ అసలు పేరు ఏమిటో ఎవరికైనా తెలుసా..? ఒక వేళ‌ ఆయన అసలు పేరు ఏమిటో తెలియకపోతే ఇక్కడ తెలుసుకోండి.

Vishwak Sen Height, Age, Girlfriend, Family, Biography ...

ఈ యువ హీరో అసలు పేరు “దినేష్ నాయుడు”.. అయితే 2017లో తన పేరుని విశ్వక్ సేన్‌గా మార్చుకున్నాడు.. దానికి కారణం ఏమిటి అంటే.. విశ్వక్ నటించిన తొలి సినిమా “వెళ్ళిపోమాకే”.. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన రెండు సంవత్సరాల వరకు ఆ సినిమా రిలీజ్ కాలేదు.. దీంతో చేసేదేమీ లేక తన తండ్రి చెప్పినట్టు న్యూమరాలజీ ప్రకారం తన పేరుని మార్చుకోవడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇక అదే సమయంలో తన తండ్రి నాలుగు పేరులు సూచించగా.. వాటిలో బెంగాలీ పేరు అయిన విశ్వక్ సేన్ ఎంచుకున్నాడు. ఈ పేరు పెట్టుకున్న దగ్గర నుంచి తన సుడి తిరిగి పోయిందట.

Tollywood Movie Actor Dinesh Naidu Biography, News, Photos, Videos | NETTV4U

ఆ పేరు మార్చుకున్న నెలలోపే తన తొలి సినిమా వెళ్లిపోమాకే విడుదలైంది.. అంతేకాకుండా ఆ పేరు మార్చుకున్న మూడు రోజుల్లోనే ఈ నగరానికి ఏమైంది సినిమాకి హీరోగా సెలెక్ట్ అయ్యాడట.. తొలి సినిమా పెద్దగా గుర్తింపు తీసి రాకపోయినా.. ఈ నగరానికి ఏమైంది సినిమా మాత్రంవిశ్వక్ సేన్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది.. తన మూడో సినిమాని తానే డైరెక్ట్ చేస్తూ.. మలయాళ సినిమాని రీమిక్‌ చేశాడు. అదే ఫ‌ల‌క్‌నుమాదాస్.. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.. ఇక ఎప్పుడు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తీసుకురాబోతున్నట్టు ప్రకటించాడు.

Vishwak Sen: Movies, Photos, Videos, News, Biography ...