నందమూరి కుటుంబం నుంచి మూడోతారం హీరోగా టాలీవుడ్‌కు ఎంట్రీ వచ్చిన ఎన్టీఆర్.. తన సినిమాలతో టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకున్నాడు.. ఇదే సమయంలో గత సంవత్సరం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారాడు. ఈ సినిమాలో కొమరం భీముడుగా తన నటనతో ప్రపంచ సినీ ప్రేక్షకులను మెప్పించాడు.
ఇక ఇప్పుడు తన 30వ సినిమాని స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నాడు. ఈ సినిమాకు దేవర అనే ఓ పవర్ఫుల్ టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇక గత నెల ఎన్టీఆర్ పుట్టినరోజు కాకనుగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇదే సమయంలో ఆచార్య వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలు పెట్టుకుని చేస్తున్న సినిమా కూడా ఇదే..ఈ సినిమాపై టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అంతేకాకుండా ఈ సినిమా ద్వారా అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఇలాంటి భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో కొరటాల శివ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఎలాంటి చిన్న పాత్ర అయినా సరే మంచి ఇమేజ్ ఉన్న హీరో హీరోయిన్లనే పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ఎన్టీఆర్ తమ్ముడు పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరో మాస్కా దాస్ విశ్వక్ సేన్‌ను కన్ఫర్మ్ చేసినట్లు ఓ వార్త వైరల్ గా మారింది.
విశ్వక్ సేన్ ఎన్టీఆర్‌కు ఎలాంటి వీర అభిమాను మనందరికీ తెలిసిందే. విశ్వక్ హీరోగా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ను ఏ రేంజ్ లో ఆయన పొగడారో మనందరం చూసాం.. ఈ నేపథ్యంలోనే విశ్వక్ నటనను మెచ్చి ఎన్టీఆర్ ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో 20 నిమిషాల క్యారెక్టర్ కోసం విశ్వక్‌ను కన్ఫర్మ్ చేశారని.. ఈ 20 నిమిషాల పాత్ర విశ్వక్ క్యారెక్టర్ సినిమాలో చనిపోతుందని.. ఆ పాత్ర సినిమాకి ఎంతో హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.