క్రికెట్ దిగ్గజం, టీమ్ఇండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ను అభిమానులు క్రికెట్ దేవుడిగా ఆరాధిస్తుంటారు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు సచిన్. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసిన మాస్టర్ బ్లాస్టర్‌క్రేజ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సచిన్‌కు క్రికెట్ తో పాటు కార్లంటే ఎంతో ఇష్టమట.
ఇప్పటికే ఆయన గ్యారేజీలో ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి.. ఇప్పుడు తాజాగా సచిన్ గ్యారేజ్ లోకి మరో లగ్జరీ కారు వచ్చి చేరింది.. లేటెస్ట్ టాప్ ఫెరియంట్ మోడల్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్ లగ్జరీ కారును సచిన్ కొనుగోలు చేశాడు.ఇక కారు ధర ఏకంగా రూ.4.18కోట్లుగా ఉంది. కారు ఉరుస్ లైనప్‌లో వచ్చిన రెండవ మోడల్.. ఇక ఈ కారు ఉరుస్ పెర్ఫార్మంట్ మోడల్ కంటే తక్కువ ధర.. ఇక సచిన్ లగ్జరీ కారులో ప్రయాణిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో సచిన్ అభిమానులను ఎంతో అలరిస్తుంది.
కాగా 2012 నుంచి ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. దీంతో అతడి గ్యారేజీలో చాలా బీఎండబ్ల్యూ కార్లు కూడా ఉన్నాయి. అదే విధంగా సచిన్‌కు మారుతి 800 అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే సచిన్ తన మెుట్ట మెుదటి కారు ప్రయాణం మారుతి 800 తోనే మొదలైంది. 1989 లోనే సచిన్ ఈ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు ఇప్పటికీ అతడి గ్యారేజీలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది.