ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ హీరోయిన్స్ ఎవరనే ప్రశ్నా అందరిలోనూ కలుగుతూ ఉంటుంది.. అయితే ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అంటే కాస్త లోతుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఇక గతంలో హీరోయిన్స్ ఐశ్వర్యరాయ్,కరీనా కపూర్ ,మాధురి దీక్షిత్ వీరంతా కాస్ట్‌లీ లైఫ్‌ను ఎంజాయ్ చేసిన కథానాయకులు ముఖ్యంగా తమ ప్రతిభ, నైపుణ్యంతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి మనులని చెప్పవచ్చు. ఇక తర్వాత జనరేషన్ కి దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ ,అనుష్క శర్మ ,తదితర హీరోయిన్స్ సైతం ఒక వెలుగు వెలిగారు.
అయితే వీళ్లంతా సంపాదన ఆస్తులు లెక్క పరిశీలిస్తే ఇటీవలే సంచలన నిజాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఐశ్వర్యారాయ్ ఆస్తి విలువ సుమారుగా రూ. 800 కోట్లకు పైగా ఉందని సమాచారం. ఇప్పటికీ అభిమానులను అలరిస్తూ పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది. అంతేకాకుండా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటీమణులలో మొదటి స్థానంలో ఉన్నది.
సినిమాకు రూ .10 కోట్లు తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ పలు వాణిజ్య ప్రకటనలలో కూడా భారీగానే సంపాదిస్తోంది. ఆ తర్వాత స్థానంలో హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆస్తి విలువ సుమారుగా రూ .550 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ప్రియాంక చోప్రా ఆస్తి విలువ అన్నట్లుగా సమాచారం. తన భర్త ఆస్తులతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఈమె కూడా ఒక్కో చిత్రానికి రు. 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటోంది.
ఆ తర్వాత స్థానంలో కరీనా కపూర్ రూ.440 కోట్ల నికర ఆస్తితో టాప్ టెన్ స్థానంలో దక్కించుకుంది. ఈమె కూడా ఒక చిత్రానికి 10 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. మరొక హీరోయిన్ దీపికా పదుకొనే ఈమె ఆస్తి దాదాపుగా రూ .300 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత స్థానం కత్రినా కైఫ్ రూ .150 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఒక చిత్రానికి రూ .10 కోట్ల రూపాయలు తీసుకుంటోంది . సొంతంగా మేకప్ బ్రాండ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత స్థానం మాధురి దీక్షిత్ దాదాపుగా రూ .100 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం.. అనుష్క శర్మ వ్యక్తిగత ఆస్తులు దాదాపుగా రూ .220 కోట్లు ఉన్నట్లు సమాచారం.. టాలీవుడ్ హీరోయిన్లలో సమంత ఆస్తి విలువ రూ .84 కోట్లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . వీరదంతా కేవలం తమ సొంత ఆస్తి కావడం విశేషం.