ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వైరల్ అవుతున్నాయి. పదేళ్ల నుంచి మంచి సినిమా లేదని.. ఇప్పుడు నడుస్తోంది అంతా సర్కస్ అంటూ కోట చెప్పారు. ఇప్పటి యంగ్ హీరోలకు సాధన తక్కువ.. వాదన ఎక్కువ అని, విజ్ఞానం పెరగాలి కానీ.. విజ్ఞానం పెరిగి జ్ఞానం పోగొట్టుకుంటున్నారని కోట తీవ్ర విమర్శలు చేశారు.
ఇక సినిమా అంటే నమ్మించడం అని చెప్పిన కోట సినిమా చూసి వచ్చిన వాళ్ళు భలే ఉందని అనాలని కోట తెలిపారు. ఇక తాను సినిమా కోసం ప్రయత్నం చేయడం లేదని.. సినిమాలో నటించిన వాళ్లు ఊరికి వచ్చారంటే ఒకప్పుడు పరిగెత్తుకుని వెళ్లి వాళ్ళని చూసేవారు అంటూ కోట నాటి అనుభవాలు గుర్తు చేసుకున్నారు. ఏది ఏమైనా ఇప్పుడున్న హీరోలకు ఏమాత్రం జ్ఞానం లేదన్నట్టుగా కోటా టార్గెట్ చేశారు.
ప్రస్తుతం ఉన్న హీరోలు కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నారని… ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న చిన్న నటులు బ్రతకడమే కష్టమైపోయిందని కోట ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న యాడ్స్ నుంచి పెద్ద యాడ్స్ వరకు అన్ని స్టార్ హీరోలు చేస్తున్నారని ఇక చిన్న ఆర్టిస్టులు ఎలా ? బ్రతుకుతారంటూ కోట ప్రశ్నించారు.
సీనియర్ ఎన్టీఆర్ 60 సంవత్సరాల వయసులో డ్యాన్స్ చేసిన కూడా ముసలోడు డ్యాన్స్ చేశాడంటూ ఎవరు ? అనలేదని కోట తెలిపారు. ఇక తెలుగు ఆర్టిస్టులకు అవకాశాలు ఇచ్చి వాళ్లను బ్రతికించాలని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా కోట ఇప్పుడున్న టాలీవుడ్ స్టార్ హీరోల, యంగ్ హీరోల ప్రవర్తనను పూర్తిగా తప్పుపడుతూ చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతున్నాయి.