అహింస‌ ‘ తో ప‌డే హింస క‌న్నా ఆ రెండు సినిమాలు చూడ‌డం చాలా బెట‌ర్‌…!

టాలీవుడ్ లో దగ్గుబాటి కుటుంబానికి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దివంగత లెజెండ్రీ నిర్మాత రామానాయుడు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించారు. ఇంకా చెప్పాలంటే భారతదేశంలోనే అన్ని భాషలలో సినిమాలు నిర్మించిన ఘనత రామానాయుడు సొంతం.. ఆయన తర్వాత ఆయన వారసులుగా సురేష్ బాబు, వెంకటేష్ తండ్రి పేరును పదింతలు పెంచారు.

nithiin on Twitter: "17 years for JAYAM! A film closest to ...

ఇక‌ సురేష్ బాబు రామానాయుడు వారసత్వాన్ని కంటిన్యూ చేస్తు నిర్మాతగా ఎదిగారు. వెంకటేష్ స్టార్ హీరోగా టాలీవుడ్ ను శాసించారు. ఇక మూడో తరంలోనూ సురేష్ బాబు ఇద్దరు తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే రానా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ తాజాగా తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు.

నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఈ టార్చర్ ఏంటి అని ? అహింస సినిమా చూస్తుంటే థియేటర్లలో తాము హింస పడుతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా ఏ మాత్రం బాగోలేదు అన్న టాక్ అయితే వచ్చేసింది. కనీసం అభిరామ్ లో నటుడిని కూడా తేజ పూర్తిగా వెలికి తీయలేదని అంటున్నారు. ఇక అహింస సినిమా తేజ గతంలో తీసిన నువ్వు నేను, జయం సినిమాలను కలిపితే ఎలా ఉంటుందో అలాగే ఉందని విమర్శలు చేస్తున్నారు.

Nuvvu Nenu (2001) - IMDb

ఎప్పుడో తుప్పు పట్టిపోయిన కథనం తీసుకుని.. దానిని కాస్త అటు ఇటుగా మార్చి అహింస సినిమాగా తేజ తెరకెక్కించేసాడు. అభిరామ్ డెబ్యూ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఏ మాత్రం ఆసక్తి లేని చెత్త సినిమా తీశారంటూ విమర్శలు చేస్తున్నారు. తేజ గత సినిమాలు నువ్వు నేను, జయం సినిమాలతో పాటు ఇతర ప్లాప్ సినిమాల్లో సీన్లు అన్ని కాపీ కొట్టి అహింస తీసినట్టుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా అభిరామ్ కు తొలి సినిమాతోనే తేజ పెద్ద షాక్ ఇచ్చారని ఇండస్ట్రీ టాక్.