లవర్ ప్రెగ్నెన్సీ పై డౌట్లు”.. ఈ నటుడు చేసిన పనికి బూతులు తిడుతున్న జనాలు..ఏం చేసాడో చూడండి..!

పుర్రెకో బుద్ధి… జిహ్వ‌కో రుచి అన్న‌ట్టుగా ఉంటుంది మ‌నుష్యుల ప్ర‌వ‌ర్త‌న‌. ముఖ్యంగా సినీ సెల‌బ్రిటీలు ముస‌లోల్లు అయినా కూడా కోరిక‌లు చావ‌క ప్రియురాళ్ల‌ను, పెళ్లాల‌ను సింపుల్‌గా మార్చేస్తూ ఉంటారు. 60 ఏళ్లు దాటాక కూడా పిల్ల‌ల‌ను కంటూనే ఉంటారు. ఉదాహ‌ర‌ణ‌కు టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు వీకే న‌రేష్ తాజాగా 62 ఏళ్ల వ‌య‌స్సులోనూ త‌న‌కంటే 20 ఏళ్లు చిన్న‌ది అయిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప‌విత్రా లోకేష్‌తో ప్రేమ‌లో ప‌డి పెళ్లికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇది న‌రేష్‌కు నాలుగో పెళ్లి.. అటు ప‌విత్రా లోకేష్‌కు మూడో పెళ్లి.

పైగా ఈ వ‌య‌స్సులో వీరిద్ద‌రు పెళ్లి చేసుకోవ‌డంతో పాటు పిల్ల‌ల‌ను కూడా కంటే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ హాలీవుడ్ స్టార్ గాడ్ ఫాద‌ర్ ఫేమ్ అల్ పాసినో 83 ఏళ్ల వ‌య‌స్సులో మ‌ళ్లీ తండ్రి అవుతున్నాడు. అయితే ఈ వ‌య‌స్సులో తండ్రి అవుతున్న విష‌యంపై న‌మ్మ‌కం లేక త‌న కొత్త ప్రియురాలికి ఏకంగా డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించాడు.

త‌న‌కు ఈ వ‌య‌స్సులో పిల్ల‌లు పుట్టే సామ‌ర్థ్యం ఉందా ? అన్న సందేహంతో త‌న ప్రియురాలు నూర్ అల్ఫ‌ల్లా గ‌ర్భం దాల్చ‌డంతో అనుమాన‌ప‌డ్డాడు. దీంతో ఆ బిడ్డ‌కు తండ్రి తాను అవునో కాదో ? అన్న సందేహంతో ఆమెకు డీఎన్ఏ టెస్ట్ చేయించాడు. దీంతో నూర్ క‌డుపులో ఉన్న బిడ్డ‌కు డీఎన్ఏ టెస్ట్ చేయ‌గా.. ఆ బిడ్డ‌కు అత‌డే తండ్రి అని తేలింది. ఈ హాలీవుడ్ స్టార్ 83 ఏళ్ల వ‌య‌స్సులో నాలుగో బిడ్డ‌కు తండ్రి అవుతున్నాడు. అయితే ఈ వ‌య‌స్సులో నీకు ఇదేం బుద్ధిరా .. అస‌లు పిల్ల‌ల‌ను క‌న‌డ‌మే పెద్ద రాంగ్ అయితే.. మ‌ళ్లీ నువ్వు ఎంజాయ్ చేసి ప్రెగ్నెన్సీ తెప్పించిన అమ్మాయికి డీఎన్ఏ టెస్టు కూడానా అని నెటిజ‌న్లు పాసినోపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇక అత‌డి ప్రియురాలు నూర్ మాత్రం ఫ‌స్ట్ టైం తల్లి కాబోతోంది. పాసినో గ‌తంలో ముగ్గురితో రిలేష‌న్ కొన‌సాగించాడు. విచిత్రం ఏంటంటే నూర్ వ‌య‌స్సు కేవ‌లం 29 సంవ‌త్స‌రాలు. అంటే త‌న‌కంటే 53 ఏళ్ల చిన్నదైన అమ్మాయితో ఇప్పుడు పాసినో సంసారం చేస్తున్నాడ‌న్న మాట‌. కోవిడ్ స‌మ‌యంలో వీరిద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డారు. ఇక నూర్ కూడా సింగ‌ర్ మిక్ జాగ‌ర్‌తో డేటింగ్ చేస్తూ 2018లో బ్రేక‌ప్ చెప్పేసింది.