సినిమా రంగంలో కుటుంబాలకు కుటుంబాలకు ఇప్పుడు వర్క్ చేస్తున్నాయి. మెగా ఫ్యామిలీని చూస్తే.. దాదాపు అందరూ ఈ రంగంలోనే ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీ కూడా అంతే. ఇలానే గతంలో హీరోయిన్ల కుటుంబాలు కూడా పనిచేసేవి. భానుమతి కుటుంబం మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉండేది. అదేవిధంగా అంజలీదేవి ఫ్యామిలీ కూడా ఇండస్ట్రీలోనే ఉండేది.
ఇలా.. హీరోయిన్ల కుటుంబాలు కూడా .. సినిమాల్లో ప్రతిష్టాత్మకంగా పేరు తెచ్చుకున్నారు. ఇలానే..షావుకారు సినిమాలో తొలిసారి హీరోయిన్ పాత్రలో నటించిన జానకి కర్ణాటకలోని బళ్లారికి చెందిన స్టేజ్ ఆర్టిస్టు. ఇంట్లో ఆమెను నటించవద్దని చెప్పేవారు. తండ్రి అసలు ఒప్పుకొనేవారు కాదు. కానీ, జానకి ఎంతో ఇంట్రస్ట్‌తో సినిమాల్లో నటించే ప్రయత్నం చేసి.. గోవింద రాజుల సుబ్బారావు ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఇలా జానకి రంగంలోకి వచ్చి నాలుగేళ్లలోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. డాక్టర్ చక్రవర్తి సినిమాలో అమోఘమైన పేరు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తన సోదరి ఇంట్రస్ట్ గమనించి.. ఇండస్ట్రీకి తీసుకువచ్చింది.. ఇలా.. గోవిందరాజుల సుబ్బారావు సహకారంతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన జానకి సోదరి.. కృష్ణకుమారి. నిజానికి వీరిని పక్క పక్కన నిలబెడితే పోలికే ఉండదు. కానీ, ఇద్దరూ స్వయానా అక్కచెల్లెళ్లు.
అయితే.. ఇద్దరూ కలిసి మాత్రం ఏ సినిమాలోనూ నటించలేదు. అయితే.. తొలినాళ్లలో తనకు వచ్చిన చాన్స్‌లను కృష్ణకుమారికి అప్పగించేవారు జానకి. తర్వాత తర్వాత..జానకి క్యారెక్టర్ పాత్రలకే పరిమితం అయితే.. కృష్ణకుమారి మాత్రం..హీరోయిన్‌గా గుర్తింపు పొంది.. సుదీర్ఘకాలం రాణించారు.