ప్రభాస్ కెరీర్ లోనే లిప్ లాక్ ఇచ్చిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..!

పాన్ ఇండియా హీరో అనే పదానికి గుర్తింపు తీసుకు వచ్చిన ఏకైక స్టార్ ప్రభాస్..ఈయనతోనే పాన్ ఇండియా సినిమాల హవా మొదలైంది.. అందుకే ప్రభాస్ ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసాడనే చెప్పుకోవాలి. ఇక మన టాలీవుడ్ హీరోలకు కొత్త రూట్ ను చూపించింది కూడా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమాలకు ముందు ఆయన మార్కెట్ కేవలం తెలుగు వారికి మాత్రమే తెలుసు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ప్రభాస్.

అయితే ప్రభాస్ సినిమాల్లో ఎంత రాయల్ గా ఉంటాడో బయట మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు.. ఈ హీరోకి ఉన్నంత సిగ్గు ఎవరికి ఉండదనే చెప్పుకోవాలి.. అంత పెద్ద పాన్ ఇండియా హీరో అయ‌న సరే చాలా సింపుల్ గా ఉంటాడు. పైగా తాను న‌టించే సినిమాలో హీరోయిన్లతో కూడా ఎక్కువ రొమాన్స్ సీన్లు, లిప్ లాక్ సీన్లు కూడా చేయడు ప్రభాస్.. కానీ ఓ సినిమాలో మాత్రం స్టార్ హీరోయిన్ కు లిప్ లాక్ ఇచ్చాడు.

ఆదే ప్రభాస్ సిని కెరియర్ లో తొలి లిప్ లాక్ అని చెప్పుకోవాలి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవర అనుకుంటున్నారా.. మరి ఎవరో కాదు అనుష్క శెట్టి. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా బాహుబలి.. ఈ సిరీస్ లో వచ్చిన సెకండ్ పార్ట్ లో “ఓరోరి రాజా వీరాధివీరా” అనే సాంగ్ చివరిలో వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను మరింత బలంగా చూపించడానికి రాజమౌళి వీరి మధ్య లిప్ లాక్ ప్లాన్ చేశాడు.. ప్రభాస్ లిప్ లాక్ ఇచ్చిన ఏకైక హీరోయిన్గా అనుష్క శెట్టి మిగిలిపోయింది.