పార్టీలో ఎన్టీఆర్ తో కలిసి నానా రచ్చ చేసిన రాజమౌళి- రాంగోపాల్ వర్మ.. ఏం చేశారో చూడండి..!

వెండితెర మీద ఆడియెన్స్‌ని అలరించే సెలబ్రిటీల రియల్ లైఫ్ గురించి తెలుసుకోవడంలో ప్రతిఒక్కరికీ క్యూరియాసిటీ ఉంటుంది. నిజ జీవితంలో వాళ్లు ఎలా బిహేవ్ చేస్తారు..? నలుగురిలో ఉన్నప్పుడు ఎలా నడుచుకుంటారు? వెండితెర మీద కనిపించినట్లుగానే రియల్ లైఫ్‌లో ఉంటారా? లేదా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు అందరినీ వెంటాడుతూనే ఉంటాయి.

ఆ విషయాలు తెలుసుకోవడం చాలా కష్టం కానీ.. అప్పుడప్పుడు వారి రియల్ లైఫ్‌కి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతునే ఉంటాయి. ఇక ఇప్పుడు గ‌తంలో జ‌రిగిన ఓ వీడియో సోష‌ల్ మీడియ‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇక ఆ వీడియోలో తారక్, రవితేజ, వర్మ, పూరీ, రాజమౌళితోపాటు మరికొందరు స్టార్‌సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇక నిజానికి ఈ వీడియో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ సినిమా హిట్ అయిన తర్వాత చిన్న పార్టీ టైంలో తీసిన వీడియో.

వరుస ప్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్ కెరియర్ కు టెంపర్ సినిమాతో భారీ హిట్ ఇచ్చాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా తర్వాత నుంచి టెంపర్ సినిమా ముందు టెంపర్ సినిమా తర్వాత అనే విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు తార‌క్‌. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 30వ సినిమా దేవరా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస‌ పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల‌ ముందుకు రాబోతున్నాడు.

ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా ఘన విజయం సాధించడంతో.. ఆ విజయాన్ని పురస్కరించుకొని నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు.. పార్టీకి దర్శకుడు పూరి జగన్నాథ్ కి అత్యంత సన్నిహితంగా ఉండే ఎంతోమంది సెలబ్రిటీలను ఆహ్వానించారు.. అక్కడికి వచ్చిన వారందరూ తెలిసిన వారు కావడంతో నానా హంగామా చేశారు.. పైగా అది ప్రైవేట్ పార్టీ కావడంతో రచ్చ మామూలుగా లేదు.

ఇక అక్కడ తమ రియల్ బిహేవర్ ని చూపించారు.. మిగతావారు సెల్‌ఫోన్‌లో వీడియోలు తీస్తున్నారు అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో చూస్తే.. ఇలాంటి ఈవెంట్ మన లైఫ్‌లోనూ ఉంటే ఎంత బాగుంటుందో అనుకునేంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. గతంలోనే ఈవెంట్‌కి సంబంధించి ఓ వీడియో లీక్ అయ్యింది. అయితే ఇప్పుడు మీరూ కూడా ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.