ఎన్టీఆర్ లేకపోతే పవన్ సూపర్ హిట్ సినిమా ఆరోజు విడుదలయ్యేది కాదా.. ? ఎవరికి తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!

చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఎన్ని ఫ్యాన్ వార్స్‌ చేసుకున్న.. వారు అభిమానించే హీరోలు మాత్రం వారి నిజ జీవితంలో ఒకరి కోసం ఒక్కరు అన్నట్టుగా ఎంతో స్నేహంగా ఉంటారు. టాలీవుడ్ లో అలాంటి స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న తన తోటి అగ్ర హీరోలు అందరితో ఎన్టీఆర్ ఎంతో మంచి స్నేహంగా ఉంటాడు.

Dammu Ntr

 

అదేవిధంగా మెగా కుటుంబం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇతర హీరోలతో ఎంతో స్నేహంగా ఉంటాడు. అయితే పవన్ కళ్యాణ్ సాధారణంగా ఇతర హీరోలతో చాలా తక్కువగా మాట్లాడుతారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ తో మాత్రం రెండు మూడు సందర్భాల్లో కలిసినప్పుడు చాలా ఉత్సాహంగా, ఎంతో సరదాగా మాట్లాడాడు.. వాటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇదే సమయంలో ఈ ఇద్దరు హీరోలు ఒక్కరి కోసం ఒక్కరు నిలబడ్డ సందర్భాలు కొన్ని ఉన్నాయి.

ఎన్టీఆర్- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన “దమ్ము” సినిమా చేశాడు.. అదే సమయంలో ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కోసం పవన్ బుక్ చేసుకున్న లొకేషన్ ని తారక్ కి ఇచ్చేశాడు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “అత్తారింటికి దారేది” సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు సినిమా మొత్తంహెచ్డి క్వాలిటీ ప్రింట్ తో బయటికి వచ్చేసిన విషయం తెలిసిందే.

Watch Attarintiki Daredi Telugu Movie on Amazon Prime | Attarintiki Daredi  Telugu Movie

ఆ సమయంలో చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు అందరూ ఈ సినిమా కోసం ఎంత సపోర్టుగా నిలబడ్డారో అనేది తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం పవన్ కు చాలా సపోర్టుగా నిలబడ్డాడు. ఆ సినిమా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కి మీరు సినిమా విడుదల చేయండి.. ఈ సినిమాకు ఒకవేళ నష్టం వస్తే మీకోసం నేను ఫ్రీగా ఒక సినిమా చేస్తానని నిర్మాతకి మాట ఇచ్చాడట.. అలా పవన్ కళ్యాణ్ తో పాటుగా ఎన్టీఆర్ కూడా గట్టి భరోసా ఇవ్వడంతో దర్శక నిర్మాతలు ఈ సినిమాని ధైర్యంగా విడుదల చేశారు. కానీ ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆ రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్ను రాబట్టి ఎన్నో సంచలనాలు సృష్టించింది..!!